Logo

యిర్మియా అధ్యాయము 9 వచనము 12

యిర్మియా 26:18 యూదా రాజైన హిజ్కియా దినములలో మోరష్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచు వచ్చెను సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు చేను దున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్లకుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలములవలె అగును.

యిర్మియా 51:37 బబులోను నిర్జనమై కసువు దిబ్బలుగా ఉండును నక్కలకు నివాసస్థలమగును అది పాడై యెగతాళికి కారణముగా ఉండును.

నెహెమ్యా 4:2 షోమ్రోను దండువారి యెదుటను తన స్నేహితుల యెదుటను ఇట్లనెను దుర్బలులైన యీ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే యీ పని ముగింతురా? బలులు అర్పించి బలపరచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరల బలమైనవిగా చేయుదురా?

కీర్తనలు 79:1 దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడియున్నారు వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరచియున్నారు యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసియున్నారు.

యెషయా 25:2 నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారముగల పట్టణము పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరల ఉండకుండ నీవు చేసితివి అది మరల ఎన్నడును కట్టబడకుండ చేసితివి.

మీకా 1:6 కాబట్టి నేను షోమ్రోనును చేనిలోనున్న రాళ్లకుప్పవలె చేసెదను, ద్రాక్షచెట్లు నాటదగిన స్థలముగా దాని ఉంచెదను, దాని పునాదులు బయలుపడునట్లు దాని కట్టుడురాళ్లను లోయలో పారబోసెదను;

మీకా 3:12 కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నతస్థలములవలె అగును.

యిర్మియా 10:22 ఆలకించుడి, ధ్వని పుట్టుచున్నది, దాని రాకధ్వని వినబడుచున్నది, యూదా పట్టణములను పాడైన స్థలముగా చేయుటకును, నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తరదేశమునుండి వచ్చుచున్న గొప్ప అల్లరిధ్వని వినబడుచున్నది.

యెషయా 13:22 వారి నగరులలో నక్కలును వారి సుఖవిలాస మందిరములలో అడవికుక్కలును మొరలిడును ఆ దేశమునకు కాలము సమీపించియున్నది దాని దినములు సంకుచితములు.

యెషయా 34:13 ఎదోము నగరులలో ముళ్లచెట్లు పెరుగును దాని దుర్గములలో దురదగొండ్లును గచ్చలును పుట్టును అది అడవికుక్కలకు నివాసస్థలముగాను నిప్పుకోళ్లకు సాలగాను ఉండును

ప్రకటన 18:2 అతడు గొప్ప స్వరముతో అర్భటించి యిట్లనెను మహా బబులోను కూలిపోయెను కూలిపోయెను. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికిపట్టును ఆయెను

యిర్మియా 34:22 యెహోవా వాక్కు ఇదే నేను ఆజ్ఞ ఇచ్చి యీ పట్టణమునకు వారిని మరల రప్పించుచున్నాను, వారు దానిమీద యుద్ధముచేసి దాని పట్టుకొని మంటపెట్టి దాని కాల్చివేసెదరు; మరియు యూదా పట్టణములను పాడుగాను నిర్జనముగాను చేయుదును.

యెషయా 44:26 నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను నా దూతల ఆలోచన నెరవేర్చువాడను యెరూషలేము నివాసస్థలమగుననియు యూదా నగరులనుగూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను, దాని పాడైన స్థలములను బాగుచేయువాడను నేనే.

విలాపవాక్యములు 2:2 ఒకటియు విడువక ప్రభువు యాకోబు నివాసస్థలములన్నిటిని నాశనము చేసియున్నాడు మహోగ్రుడై యూదాకుమార్తె కోటలను పడగొట్టియున్నాడు వాటిని నేలకు కూల్చివేసియున్నాడు ఆ రాజ్యమును దాని యధిపతులను ఆయన అపవిత్రపరచియున్నాడు.

విలాపవాక్యములు 2:7 ప్రభువు తన బలిపీఠము విడనాడెను తన పరిశుద్ధస్థలమునందు అసహ్యించుకొనెను దానినగరుల ప్రాకారములను శత్రువులచేతికి అప్పగించెను వారు నియామకకాలమున జనులు చేయునట్లు యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి.

విలాపవాక్యములు 2:8 సీయోను కుమారియొక్క ప్రాకారములను పాడుచేయుటకు యెహోవా ఉద్దేశించెను నాశనము చేయుటకు తన చెయ్యి వెనుకతీయక ఆయన కొలనూలు సాగలాగెను. ప్రహరియు ప్రాకారమును దీనిగూర్చి మూల్గుచున్నవి అవి యేకరీతిగా క్షీణించుచున్నవి.

యిర్మియా 25:11 ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును; ఈ జనులు డెబ్బది సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు.

యిర్మియా 25:18 నేటివలెనే పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను చేయుటకు యెరూషలేమునకును యూదా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించితిని.

విలాపవాక్యములు 3:47 భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి.

మీకా 6:16 ఏలయనగా మీరు ఒమీ నియమించిన కట్టడల నాచరించుచు, అహాబు ఇంటివారు చేసిన క్రియలన్నిటి ననుసరించుచు వారి యోచనలనుబట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతిపుట్టించు జనులుగాను పట్టణనివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోవుచున్నాను.

లేవీయకాండము 26:31 నా మనస్సు మీయందు అసహ్యపడును, నేను మీ పట్టణములను పాడుచేసెదను; మీ పరిశుద్ధస్థలములను పాడుచేసెదను; మీ సువాసనగల వాటి సువాసనను ఆఘ్రాణింపను.

లేవీయకాండము 26:32 నేనే మీ దేశమును పాడుచేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాని చూచి ఆశ్చర్యపడెదరు.

ద్వితియోపదేశాకాండము 28:16 పట్టణములో నీవు శపింపబడుదువు; పొలములో నీవు శపింపబడుదువు;

యెహోషువ 8:28 అట్లు యెహోషువ హాయినిత్యము పాడైపోవలెనని దాని కాల్చివేసెను; నేటి వరకు అది అట్లేయున్నది.

యోబు 15:28 అట్టివారు పాడైన పట్టణములలో నివసించుదురు ఎవరును నివసింపకూడని యిండ్లలో దిబ్బలు కావలసియున్న యిండ్లలో నివసించెదరు

కీర్తనలు 137:3 అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తనపాడుడి అనిరి మనలను బాధించినవారు సీయోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మనవలన ఉల్లాసము గోరిరి

యెషయా 24:12 పట్టణములో పాడు మాత్రము శేషించెను గుమ్మములు విరుగగొట్టబడెను.

యిర్మియా 1:15 ఇదిగో నేను ఉత్తరదిక్కుననున్న రాజ్యముల సర్వవంశస్థులను పిలిచెదను, వారు వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మములలోను, యెరూషలేము చుట్టునున్న ప్రాకారములన్నిటికి ఎదురుగాను, యూదాపట్టణములన్నిటికి ఎదురుగాను తమ సింహాసనములను స్థాపింతురు.

యిర్మియా 2:15 కొదమ సింహములు వానిపైని బొబ్బలు పెట్టెను గర్జించెను, అవి అతని దేశము పాడుచేసెను, అతని పట్టణములు నివాసులులేక పాడాయెను.

యిర్మియా 4:7 పొదలలోనుండి సింహము బయలుదేరియున్నది; జనముల వినాశకుడు బయలుదేరియున్నాడు, నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచియున్నాడు, నీ పట్టణములు పాడై నిర్జనముగానుండును.

యిర్మియా 6:8 యెరూషలేమా, నేను నీయొద్దనుండి తొలగింపబడకుండునట్లును నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండునట్లును శిక్షకు లోబడుము.

యిర్మియా 7:20 అందువలన ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ స్థలముమీదను నరులమీదను జంతువులమీదను పొలముల చెట్లమీదను భూమిపంటమీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించెదను, ఆర్పశక్యము కాకుండ అది మండును.

యిర్మియా 12:11 వారు దాని పాడుచేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది; దానిగూర్చి చింతించువాడొకడును లేడు గనుక దేశమంతయు పాడాయెను.

యిర్మియా 18:16 వారు ఎల్లప్పుడును అపహాస్యాస్పదముగా నుండుటకై తమ దేశమును పాడుగా చేసికొనియున్నారు, దాని మార్గమున నడుచు ప్రతివాడును ఆశ్చర్యపడి తల ఊచును.

యిర్మియా 22:6 యూదారాజు వంశస్థులనుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా యెన్నికలో నీవు గిలాదువలెనున్నావు, లెబానోను శిఖరమువలె ఉన్నావు; అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసులులేని పట్టణములుగాను నేను నిన్ను చేయుదును.

యిర్మియా 44:2 నేను యెరూషలేము మీదికిని యూదా పట్టణములన్నిటి మీదికిని రప్పించిన కీడంతయు మీరు చూచుచునే యున్నారు.

యిర్మియా 49:33 హాసోరు చిరకాలము పాడై నక్కలకు నివాస స్థలముగా ఉండును అక్కడ ఏ మనుష్యుడును కాపురముండడు ఏ నరుడును దానిలో బసచేయడు.

విలాపవాక్యములు 1:1 జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకియై దుఃఖాక్రాంతమాయెను? అది విధవరాలివంటిదాయెను. అన్యజనులలో ఘనతకెక్కినది సంస్థానములలో రాచకుమార్తెయైనది ఎట్లు పన్ను చెల్లించునదైపోయెను?

విలాపవాక్యములు 1:4 సీయోను మార్గములు ప్రలాపించుచున్నవి పట్టణపు గుమ్మములన్నియు పాడైపోయెను యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి అదియు వ్యాకులభరితురాలాయెను.

విలాపవాక్యములు 3:11 నాకు త్రోవలేకుండ చేసి నా యవయవములను విడదీసియున్నాడు నాకు దిక్కులేకుండ చేసియున్నాడు

విలాపవాక్యములు 5:18 నక్కలు దానిమీద తిరుగులాడుచున్నవి మా కన్నులు దీని చూచి మందగిలెను.

యెహెజ్కేలు 6:6 నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు మీ బలిపీఠములు విడువబడి పాడైపోవును, మీ విగ్రహములు ఛిన్నా భిన్నములగును,సూర్య దేవతకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును, మీ పనులు నాశనమగును, మీ నివాస స్థలములన్నిటిలో నున్న మీ పట్టణములు పాడైపోవును, మీ ఉన్నత స్థలములు విడువబడును,

యెహెజ్కేలు 12:19 దేశములోని జనులకీలాగు ప్రకటించుము యెరూషలేము నివాసులనుగూర్చియు ఇశ్రాయేలు దేశమునుగూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా దానిలోనున్న కాపురస్థులందరును చేసిన బలాత్కారమునుబట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారము తిందురు భయభ్రాంతితో నీళ్లు త్రాగుదురు

యెహెజ్కేలు 33:28 ఆ దేశమును నిర్జనముగాను పాడుగానుచేసి దాని బలాతిశయమును మాన్పించెదను, ఎవరును వాటిలో సంచరింపకుండ ఇశ్రాయేలీయుల మన్యములు పాడవును.

జెఫన్యా 1:13 వారి ఆస్తి దోపుడుసొమ్మగును, వారి ఇండ్లు పాడగును, వారు ఇండ్లు కట్టుదురు గాని వాటిలో కాపురముండరు, ద్రాక్షతోటలు నాటుదురు గాని వాటి రసమును పానము చేయరు.

జెఫన్యా 1:18 యెహోవా ఉగ్రతదినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును, రోషాగ్నిచేత భూమియంతయు దహింపబడును, హఠాత్తుగా ఆయన భూనివాసులనందరిని సర్వనాశనము చేయబోవుచున్నాడు.

మలాకీ 1:3 ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసితిని.