Logo

యిర్మియా అధ్యాయము 17 వచనము 27

యిర్మియా 32:44 నేను వారిలో చెరపోయినవారిని రప్పింపబోవుచున్నాను గనుక బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంతములలోను యూదా పట్టణములలోను మన్యములోని పట్టణములలోను దక్షిణదేశపు పట్టణములలోను మనుష్యులు క్రయమిచ్చి పొలములు కొందురు, క్రయపత్రములు వ్రాయించుకొందురు, ముద్రవేయుదురు, సాక్షులను పెట్టుదురు; ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 33:13 మన్నెపు పట్టణములలోను మైదానపు పట్టణములలోను దక్షిణదేశపు పట్టణములలోను బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంత స్థలములలోను యూదా పట్టణములలోను మందలు లెక్కపెట్టువారిచేత లెక్కింపబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యెహోషువ 15:21 దక్షిణదిక్కున ఎదోము సరిహద్దువరకు యూదా వంశస్థుల గోత్రముయొక్క పట్టణ ములు ఏవేవనగాకబ్సెయేలు

యెహోషువ 15:22 ఏదెరు యా గూరు కీనాది

యెహోషువ 15:23 మోనా అదాదా కెదెషు

యెహోషువ 15:24 హాసోరు యిత్నాను జీఫు

యెహోషువ 15:25 తెలెము బెయాలోతు క్రొత్త

యెహోషువ 15:26 హాసోరు కెరీయోతు హెస్రోను

యెహోషువ 15:27 అనబడిన హాసోరు అమాము

యెహోషువ 15:28 షేమ మోలాదా హసర్గద్దా హెష్మోను

యెహోషువ 15:29 బేత్పెలెతు హసర్షువలు బెయేర్షెబా

యెహోషువ 15:30 బిజ్యోత్యాబాలా ఈయ్యె ఎజెము

యెహోషువ 15:31 ఎల్తోలదు కెసీలు హోర్మా సిక్లగు మద్మన్నా

యెహోషువ 15:32 సన్సన్నా లెబాయోతు షిల్హిము అయీను రిమ్మోను అనునవి, వాటి పల్లెలు పోగా ఈ పట్ట ణములన్నియు ఇరువది తొమ్మిది.

యెహోషువ 15:33 మైదానములో ఏవనగా ఎష్తాయోలు జొర్యా అష్నా

యెహోషువ 15:34 జానోహ ఏన్గన్నీము తప్పూయ ఏనాము

యెహోషువ 15:35 యర్మూతు అదు ల్లాము శోకో అజేకా

యెహోషువ 15:36 షరాయిము అదీతాయిము గెదేరా గెదెరోతాయిము అనునవి. వాటి పల్లెలు పోగా పదు నాలుగు పట్టణములు.

యెహోషువ 15:37 సెనాను హదాషా మిగ్దోల్గాదు

యెహోషువ 15:38 దిలాను మిస్పే యొక్తయేలు

యెహోషువ 15:39 లాకీషు బొస్కతు ఎగ్లోను

యెహోషువ 15:40 కబ్బోను లహ్మాసు కిత్లిషు గెదెరోతు

యెహోషువ 15:41 బేత్దాగోను నయమా మక్కేదా అనునవి, వాటి పల్లెలు పోగా పదియారు పట్ట ణములు.

యెహోషువ 15:42 లిబ్నా ఎతెరు ఆషాను యిప్తా అష్నానెసీబు

యెహోషువ 15:43 కెయీలా అక్జీబు మారేషా అనునవి,

యెహోషువ 15:44 వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణములు. ఎక్రోను దాని గ్రామములును పల్లెలును,

యెహోషువ 15:45 ఎక్రోను మొదలుకొని సముద్రమువరకు అష్డోదు ప్రాంత మంతయు,

యెహోషువ 15:46 దాని పట్టణములును గ్రామములును, ఐగుప్తు ఏటివరకు పెద్ద సముద్రమువరకును అష్డోదును,

యెహోషువ 15:47 గాజాను వాటి ప్రాంతమువరకును వాటి గ్రామములును పల్లెలును,

యెహోషువ 15:48 మన్య ప్రదేశమందు షామీరు యత్తీరు

యెహోషువ 15:49 శోకో దన్నా కిర్య త్సన్నా

యెహోషువ 15:50 అను దెబీరు అనాబు ఎష్టెమో

యెహోషువ 15:51 ఆనీము గోషెను హోలోను గిలో అనునవి,

యెహోషువ 15:52 వాటి గ్రామములు పోగా పదకొండు పట్టణములు.

యెహోషువ 15:53 ఆరాబు దూమా ఎషాను

యెహోషువ 15:54 యానీము బేత్తపూయ అఫెకా హుమ్తా కిర్యతర్బా అను హెబ్రోను సీయోరు అనునవి, వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణములు.

యెహోషువ 15:55 మాయోను కర్మెలు జీఫు యుట్టయెజ్రెయేలు

యెహోషువ 15:56 యొక్దె యాము జానోహ

యెహోషువ 15:57 కయీను గిబియా తిమ్నా అనునవి, వాటి పల్లెలు పోగా పది పట్టణములు.

యెహోషువ 15:58 హల్హూలు బేత్సూరు గెదోరు మారాతు

యెహోషువ 15:59 బేతనోతు ఎల్తెకోననునవి, వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు.

యెహోషువ 15:60 కిర్యత్యారీ మనగా కిర్యత్బయలు రబ్బా అనునవి, వాటి పల్లెలు పోగా రెండు పట్టణములు.

యెహోషువ 15:61 అరణ్యమున బేతరాబా మిద్దీను సెకాకా నిబ్షాను యీల్మెలహు ఎన్గెదీ అనునవి,

యెహోషువ 15:62 వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు.

యెహోషువ 15:63 యెరూషలేములో నివసించిన యెబూసీ యులను యూదా వంశస్థులు తోలివేయ లేకపోయిరి గనుక యెబూసీయులు నేటివరకు యెరూషలేములో యూదా వంశస్థులయొద్ద నివసించుచున్నారు.

జెకర్యా 7:7 యెరూషలేములోను దాని చుట్టును పట్టణములలోను దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్నకాలమున పూర్వికులగు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండవచ్చునా?

లేవీయకాండము 1:1 యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములోనుండి అతనికీలాగు సెలవిచ్చెను.

లేవీయకాండము 7:38 ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణములను తీసికొనిరావలెనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండమీద మోషేకు ఆలాగుననే ఆజ్ఞాపించెను.

ఎజ్రా 3:3 వారు దేశమందు కాపురస్థులైన వారికి భయపడుచు, ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి, దానిమీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చిరి

ఎజ్రా 3:4 మరియు గ్రంథమునుబట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి,ఏ దినమునకు నియమింపబడిన లెక్కచొప్పున ఆ దినపు దహనబలిని విధి చొప్పున అర్పింపసాగిరి.

ఎజ్రా 3:5 తరువాత నిత్యమైన దహనబలిని, అమావాస్యలకును యెహోవా యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహనబలులను, ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచు వచ్చిరి.

ఎజ్రా 3:6 ఏడవ నెల మొదటి దినమునుండి యెహోవాకు దహనబలులు అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరము యొక్క పునాది అప్పటికి ఇంకను వేయబడలేదు.

ఎజ్రా 3:11 వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి, జనులందరును గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి.

యిర్మియా 33:11 సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరల వినబడును; యెహోవా మందిరములోనికి స్తుతి యాగములను తీసికొని వచ్చువారి స్వరమును మరల వినబడును; మునుపటివలె ఉండుటకై చెరలోనున్న యీ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు

కీర్తనలు 107:22 వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక.

కీర్తనలు 116:17 నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థన చేసెదను

హెబ్రీయులకు 13:15 కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.

1పేతురు 2:5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

1పేతురు 2:9 అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ద జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు

1పేతురు 2:10 ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.

ప్రకటన 1:5 నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆదిసంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.

యిర్మియా 13:19 దక్షిణదేశ పట్టణములు మూయబడియున్నవి; వాటిని తెరువగలవాడెవడును లేడు; యూదావారందరు చెరపట్టబడిరి; ఏమియు లేకుండ సమస్తము కొనిపోబడెను.

యిర్మియా 33:12 సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మనుష్యులైనను జంతువులైనను లేక పాడైయున్న యీ స్థలములోను దాని పట్టణములన్నిటిలోను గొఱ్ఱల మందలను మేపుచు పరుండబెట్టు కాపరులుందురు.