Logo

యిర్మియా అధ్యాయము 19 వచనము 14

2రాజులు 23:10 మరియు ఎవడైనను తన కుమారునేగాని కుమార్తెనేగాని మొలెకునకు అగ్నిగుండము దాటించకుండునట్లు బెన్‌ హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేసెను.

2రాజులు 23:12 మరియు యూదారాజులు చేయించిన ఆహాజు మేడగది పైనున్న బలిపీఠములను, యెహోవా మందిరపు రెండు సాలలలో మనష్షే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి ఛిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను.

2రాజులు 23:14 ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి, అషేరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నర శల్యములతో నింపెను.

కీర్తనలు 74:7 నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్ర పరచుదురు.

కీర్తనలు 79:1 దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడియున్నారు వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరచియున్నారు యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసియున్నారు.

యెహెజ్కేలు 7:21 వారు దాని అపవిత్రపరచునట్లు అన్యులచేతికి దోపుడు సొమ్ముగాను దుర్మార్గులైన జనులకు లూటిగాను నేను దానిని అప్పగించెదను.

యెహెజ్కేలు 7:22 వారిని చూడకుండ నా ముఖమును నేను త్రిప్పుకొందును గనుక శత్రువులు నా నిధిస్థానమును అపవిత్రపరచుదురు, దొంగలు చొరబడి దానిని అపవిత్రపరచుదురు.

యిర్మియా 32:29 ఈ పట్టణముమీద యుద్ధముచేయు కల్దీయులు వచ్చి, యీ పట్టణమునకు అగ్ని ముట్టించి, యే మిద్దెలమీద జనులు బయలునకు ధూపార్పణచేసి అన్యదేవతలకు పానార్పణములనర్పించి నాకు కోపము పుట్టించిరో ఆ మిద్దెలన్నిటిని కాల్చివేసెదరు.

2రాజులు 23:12 మరియు యూదారాజులు చేయించిన ఆహాజు మేడగది పైనున్న బలిపీఠములను, యెహోవా మందిరపు రెండు సాలలలో మనష్షే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి ఛిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను.

జెఫన్యా 1:5 మిద్దెలమీద ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కువారిని యెహోవా పేరును బట్టియు, బయలుదేవత తమకు రాజనుదాని నామమును బట్టియు మ్రొక్కి ప్రమాణము చేయువారిని నేను నిర్మూలము చేసెదను.

యిర్మియా 7:18 నాకు కోపము పుట్టించునట్లు ఆకాశరాణి దేవతకు పిండివంటలు చేయవలెననియు, అన్యదేవతలకు పానార్పణములు పోయవలెననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు.

ద్వితియోపదేశాకాండము 4:19 సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశసైన్యమును చూచి మరలుకొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకొరకు పంచిపెట్టినవాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్తపడుడి.

ద్వితియోపదేశాకాండము 22:8 క్రొత్త యిల్లు కట్టించునప్పుడు దానిమీదనుండి యెవడైనను పడుటవలన నీ యింటిమీదికి హత్యదోషము రాకుండుటకై నీ యింటి పైకప్పునకు చుట్టు పిట్టగోడ కట్టింపవలెను.

1సమూయేలు 9:25 పట్టణస్థులు ఉన్నతమైన స్థలము మీదనుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దెమీద మాటలాడుచుండెను.

2సమూయేలు 11:2 ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకువేళ దావీదు పడకమీదనుండి లేచి రాజనగరి మిద్దెమీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానముచేయు ఒక స్త్రీ కనబడెను.

2దినవృత్తాంతములు 28:3 మరియు అతడు బెన్‌ హిన్నోము లోయయందు ధూపము వేసి ఇశ్రాయేలీయుల యెదుటనుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియలచొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను.

2దినవృత్తాంతములు 33:3 ఇతడు తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నతస్థలములను తిరిగికట్టించి, బయలు దేవతకు బలిపీఠములను నిలిపి, దేవతాస్తంభములను చేయించి, ఆకాశనక్షత్రములన్నిటిని పూజించి కొలిచెను.

నెహెమ్యా 8:16 ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరు తమ తమ యిండ్ల మీదను తమ లోగిళ్లలోను దేవమందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి.

యెషయా 15:3 తమ సంత వీధులలో గోనెపట్ట కట్టుకొందురు వారి మేడలమీదను వారి విశాలస్థలములలోను వారందరు ప్రలాపించుదురు కన్నీరు ఒలకపోయుదురు.

యెషయా 57:6 నీ భాగ్యము లోయలోని రాళ్లలోనేయున్నది అవియే నీకు భాగ్యము, వాటికే పానీయార్పణము చేయుచున్నావు వాటికే నైవేద్యము నర్పించుచున్నావు. ఇవన్నియు జరుగగా నేను ఊరకుండదగునా?

యిర్మియా 7:32 కాలము సమీపించుచున్నది; అప్పుడు అది తోఫెతు అనియైనను బెన్‌హిన్నోము లోయ అనియైనను అనబడక వధలోయ అనబడును; పాతిపెట్టుటకు స్థలము లేకపోవువరకు తోఫెతులో శవములు పాతి పెట్టబడును; ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 8:2 వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణచేయుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల యెదుట వాటిని పరచెదరు; అవి కూర్చబడకయు పాతిపెట్టబడకయు భూమిమీద పెంటవలె పడియుండును.

యిర్మియా 44:5 వారు అలకింపకపోయిరి, అన్యదేవతలకు ధూపార్పణముచేయుట మానకపోయిరి, తమ దుర్మార్గతను విడువకపోయిరి చెవియొగ్గకపోయిరి.

యిర్మియా 44:17 మేము నీతో చెప్పిన సంగతులన్నిటిని నిశ్చయముగా నెరవేర్చబోవుచున్నాము; మేమును మా పితరులును మా రాజులును మా యధిపతులును యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశరాణికి ధూపము వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము; ఏలయనగా మేము ఆలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే యుంటిమి, యే కీడును మాకు కలుగలేదు.

లూకా 5:19 జనులు గుంపుకూడి యుండినందున, వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయెను గనుక, ఇంటిమీదికెక్కి పెంకులు విప్పి, మంచముతో కూడ యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి.

అపోస్తలులకార్యములు 7:42 అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశసైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగు వ్రాయబడియున్నది. ఇశ్రాయేలు ఇంటివారలారా మీరు అరణ్యములో నలువదియేండ్లు బలిపశువులను అర్పణములను నాకు అర్పించితిరా?