Logo

యిర్మియా అధ్యాయము 24 వచనము 4

యిర్మియా 1:11 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యిర్మీయా, నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు బాదముచెట్టు చువ్వ కనబడుచున్నదని నేననగా

యిర్మియా 1:12 యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి; నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాననెను.

యిర్మియా 1:13 రెండవమారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని సెలవియ్యగా నేను మసలుచున్న బాన నాకు కనబడుచున్నది; దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగియున్నదంటిని.

యిర్మియా 1:14 అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను ఉత్తర దిక్కునుండి కీడు బయలుదేరి యీ దేశనివాసులందరిమీదికి వచ్చును.

1సమూయేలు 9:9 ఇప్పుడు ప్రవక్తయను పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శియనిపించుకొనెను. పూర్వము ఇశ్రాయేలీయులలో దేవునియొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన యెడల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకొనుట వాడుక.

ఆమోసు 7:8 యెహోవా ఆమోసూ, నీకు కనబడుచున్నదేమని నన్నడుగగా నాకు మట్టపుగుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా నా జనులగు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపుగుండు వేయబోవుచున్నాను. నేనికను వారిని దాటిపోను

ఆమోసు 8:2 ఆమోసూ, నీకు కనబడుచున్నదేమని నన్నడుగగా వేసవికాలపు పండ్లగంప నాకు కనబడుచున్నదని నేనంటిని, అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా నా జనులగు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చేయున్నది, నేనికను వారిని విచారణచేయక మానను.

జెకర్యా 4:2 నీకు ఏమి కనబడుచున్నదని యడుగగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును దానిమీద ఒక ప్రమిదెయును, దీపస్తంభమునకు ఏడు దీపములును దీపమునకు ఏడేసి గొట్టములును కనబడుచున్నవి.

జెకర్యా 5:2 నీకేమి కనబడుచున్నదని అతడు నన్నడుగగా నేను, ఇరువైమూరల నిడివియు పదిమూరల వెడల్పునుగల యెగిరిపోవు పుస్తకమొకటి నాకు కనబడుచున్నదంటిని.

జెకర్యా 5:5 అప్పుడు నాతో మాటలాడుచున్న దూత బయలువెళ్లి నీవు నిదానించి చూచి ఇవతలకు వచ్చునదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా

జెకర్యా 5:6 ఇదేమిటియని నేనడిగితిని. అందుకతడు ఇది కొల, ఇది బయలువెళ్లు తూము అనెను; మరియు లోకమంతటను జనులు ఈలాగున కనబడుదురని చెప్పెను.

జెకర్యా 5:7 అప్పుడు సీసపుబిళ్లను తీయగా కొలతూములో కూర్చున్న యొక స్త్రీ కనబడెను.

జెకర్యా 5:8 అప్పుడతడు ఇది దోషమూర్తియని నాతో చెప్పి తూములో దాని పడవేసి సీసపుబిళ్లను తూముమీద నుంచెను.

జెకర్యా 5:9 నేను మరల తేరిచూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరిరి; సంకుబుడి కొంగ రెక్కలవంటి రెక్కలు వారికుండెను, గాలి వారి రెక్కలను ఆడించుచుండెను, వారు వచ్చి తూమును భూమ్యాకాశముల మధ్యకు ఎత్తి దాని మోసిరి.

జెకర్యా 5:10 వీరు ఈ తూమును ఎక్కడికి తీసికొని పోవుదురని నాతో మాటలాడుచున్న దూతను నేనడుగగా

జెకర్యా 5:11 షీనారు దేశమందు దానికొక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు; అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠముమీద పెట్టి యుంచుదురని అతడు నాకుత్తరమిచ్చెను.

మత్తయి 25:32 అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగుచేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి

మత్తయి 25:33 తన కుడివైపున గొఱ్ఱలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును.