Logo

యిర్మియా అధ్యాయము 37 వచనము 13

1రాజులు 19:3 కాబట్టి అతడు ఈ సమాచారము తెలిసికొని, లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి, యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి, అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి

1రాజులు 19:9 అచ్చట ఉన్న యొక గుహలో చేరి బసచేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఏలీయా, యిచ్చట నీవేమి చేయుచున్నావని అతని నడుగగా

నెహెమ్యా 6:11 నేను నావంటి వాడు పారిపోవచ్చునా? ఇంతవాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని.

మత్తయి 10:23 వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి; మనుష్యకుమారుడు వచ్చువరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసియుండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

1దెస్సలోనీకయులకు 5:22 ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి.

యిర్మియా 1:1 బెన్యామీనుదేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై, హిల్కీయా కుమారుడైన యిర్మీయా వాక్యములు

యెహోషువ 21:17 బెన్యామీను గోత్రము నుండి నాలుగు పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును గెబను దాని పొలమును

యెహోషువ 21:18 అనాతోతును దాని పొలమును అల్మోనును దాని పొలమును ఇచ్చిరి.

1దినవృత్తాంతములు 6:60 మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబ దాని గ్రామములు, అల్లెమెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు, వీరి వంశములకు కలిగిన పట్టణములన్నియు పదుమూడు.

కీర్తనలు 55:7 త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని

మత్తయి 24:16 యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను

లూకా 21:21 అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; దాని మధ్యనుండువారు వెలుపలికి పోవలెను; పల్లెటూళ్లలోనివారు దానిలో ప్రవేశింపకూడదు.