Logo

యిర్మియా అధ్యాయము 39 వచనము 2

యిర్మియా 52:4 అతని యేలుబడియందు తొమ్మిదవ సంవత్సరము పదియవ నెల పదియవ దినమున బబులోను రాజైన నెబుకద్రెజరు తన సైన్యమంతటితో యెరూషలేముమీదికి వచ్చి, దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టు కోటలు కట్టిరి.

యిర్మియా 52:5 ఆలాగు జరుగగా సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవత్సరమువరకు పట్టణము ముట్టడిలో నుంచబడెను.

యిర్మియా 52:6 నాల్గవ నెల తొమ్మిదవ దినమున క్షామము పట్టణములో హెచ్చుగా నున్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయెను.

యిర్మియా 52:7 పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరు పారిపోయి రాజుతోటకు దాపైన రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రియందు పట్టణములోనుండి బయలువెళ్లిరి; కల్దీయులు పట్టణమును చుట్టుకొనియుండగా సైనికులు యొర్దానునది మార్గముగా తర్లిపోయిరి.

2రాజులు 25:1 అతని యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు పదియవ మాసము పదియవ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతయును యెరూషలేము మీదికి వచ్చి దానికెదురుగా దిగి దాని చుట్టును ముట్టడిదిబ్బలు కట్టిరి.

2రాజులు 25:2 ఈ ప్రకారము రాజైన సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవత్సరము వరకు పట్టణము ముట్టడి వేయబడియుండగా

2రాజులు 25:3 నాల్గవ నెల తొమ్మిదవ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయెను, దేశపు జనులకు ఆహారము లేకపోయెను.

2రాజులు 25:4 కల్దీయులు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రియందు రాజు తోటదగ్గర రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయిరి.

2రాజులు 25:5 అయితే కల్దీయులు పట్టణముచుట్టు ఉండగా రాజు మైదానమునకు పోవుమార్గమున వెళ్లిపోయెను; కల్దీయుల సైన్యము రాజును తరిమి, అతని సైన్యము అతనికి దూరముగా చెదరిపోయినందున యెరికో మైదానమందు అతని పట్టుకొనిరి.

2రాజులు 25:6 వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునొద్దకు తీసికొనిపోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను.

2రాజులు 25:7 సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి యిత్తడి సంకెళ్లతో అతని బంధించి బబులోను పట్టణమునకు తీసికొనిపోయిరి.

యెహెజ్కేలు 24:1 తొమ్మిదియవ సంవత్సరము పదియవ నెల పదియవ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

యెహెజ్కేలు 24:2 నరపుత్రుడా, ఈదినము పేరు వ్రాసియుంచుము, నేటిదినము పేరు వ్రాసియుంచుము, ఈ దినము బబులోను రాజు యెరూషలేముమీదికి వచ్చుచున్నాడు.

జెకర్యా 8:19 సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా నాలుగవ నెలలోని ఉపవాసము, అయిదవ నెలలోని ఉపవాసము, ఏడవ నెలలోని ఉపవాసము, పదియవ నెలలోని ఉపవాసము యూదా యింటివారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి.

ఎస్తేరు 2:16 ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడియందు ఏడవ సంవత్సరమున టెబేతు అను పదియవ నెలలో రాజ నగరులోనికి అతనియొద్దకు పోగా

ద్వితియోపదేశాకాండము 28:52 మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములుగల నీ కోటలు పడువరకును నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోను వారు నిన్ను ముట్టడివేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోను నిన్ను ముట్టడివేయుదురు.

1రాజులు 8:37 దేశమందు క్షామముగాని తెగులుగాని గాడ్పు దెబ్బగాని చిత్తపట్టుటగాని మిడతలుగాని చీడపురుగుగాని కలిగినను, వారి శత్రువు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడివేసినను, ఏ తెగులుగాని వ్యాధిగాని కలిగినను,

2దినవృత్తాంతములు 36:17 ఆయన వారిమీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యౌవనులను ఖడ్గముచేత సంహరించెను. అతడు యౌవనులయందైనను, యువతులయందైనను, ముసలివారియందైనను, నెరసిన వెండ్రుకలుగల వారియందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరిని అతని చేతికప్పగించెను.

ఎజ్రా 2:1 బబులోను రాజైన నెబుకద్నెజరుచేత బబులోను దేశమునకు చెరగా తీసికొని పోబడినవారికి ఆ దేశమందు పుట్టి చెరలోనుండి విడిపింపబడి

ఎజ్రా 5:12 మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరను బబులోను రాజుచేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనముచేసి జనులను బబులోను దేశములోనికి చెరపట్టుకొని పోయెను.

నెహెమ్యా 7:6 జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా అజర్యా రయమ్యా నహమానీ మొర్దెకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి నెహూము బయనా అనువారితోకూడ బాబెలు రాజైన నెబుకద్నెజరుచేత చెరలోనికి కొనిపోబడి

నెహెమ్యా 9:32 చేసిన నిబంధనను నిలుపుచు కృప చూపునట్టి మహా పరాక్రమశాలివియు భయంకరుడవునగు మా దేవా, అష్షూరు రాజుల దినములు మొదలుకొని యీ దినములవరకు మా మీదికిని మా రాజుల మీదికిని ప్రధానుల మీదికిని మా పితరుల మీదికిని నీ జనులందరి మీదికిని వచ్చిన శ్రమయంతయు నీ దృష్టికి అల్పముగా ఉండకుండును గాక.

కీర్తనలు 80:13 అడవిపంది దాని పెకలించుచున్నది పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి.

యెషయా 22:7 అందుచేత అందమైన నీ లోయలనిండ రథములున్నవి గుఱ్ఱపురౌతులు గవినియొద్ద వ్యూహమేర్పరచుకొనుచున్నారు.

యిర్మియా 1:12 యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి; నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాననెను.

యిర్మియా 4:16 ముట్టడి వేయువారు దూరదేశమునుండి వచ్చి యూదా పట్టణములను పట్టుకొందుమని బిగ్గరగా అరచుచున్నారని యెరూషలేమునుగూర్చి ప్రకటనచేయుడి, జనములకు తెలియజేయుడి.

యిర్మియా 6:3 గొఱ్ఱల కాపరులు తమ మందలతో ఆమెయొద్దకు వచ్చెదరు, ఆమె చుట్టు తమ గుడారములను వేయుదురు, ప్రతివాడును తనకిష్టమైనచోట మందను మేపును.

యిర్మియా 21:1 రాజైన సిద్కియా మల్కీయా కుమారుడైన పషూరును యాజకుడగు మయశేయా కుమారుడైన జెఫన్యాను పిలిపించి

యిర్మియా 21:2 బబులోను రాజైన నెబుకద్రెజరు మనమీద యుద్ధము చేయుచున్నాడు; అతడు మనయొద్దనుండి వెళ్లిపోవునట్లు యెహోవా తన అద్భుతకార్యములన్నిటిని చూపి మనకు తోడైయుండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించుమని చెప్పుటకు యిర్మీయా యొద్దకు వారిని పంపగా యెహోవా యొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.

యిర్మియా 32:1 యూదా రాజైన సిద్కియా యేలుబడి పదియవ సంవత్సరమున, అనగా నెబుకద్రెజరు ఏలుబడి పదునెనిమిదవ సంవత్సరమున యెహోవా యొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.

యిర్మియా 34:1 బబులోను రాజైన నెబుకద్రెజరును అతని సమస్త సేనయు అతని అధికారముక్రిందనున్న భూరాజ్యములన్నియు జనములన్నియు కూడి యెరూషలేముమీదను దాని పురములన్నిటిమీదను యుద్ధము చేయుచుండగా యెహోవా యొద్దనుండి యిర్మీయాకు దర్శనమైన వాక్కు.

యిర్మియా 34:22 యెహోవా వాక్కు ఇదే నేను ఆజ్ఞ ఇచ్చి యీ పట్టణమునకు వారిని మరల రప్పించుచున్నాను, వారు దానిమీద యుద్ధముచేసి దాని పట్టుకొని మంటపెట్టి దాని కాల్చివేసెదరు; మరియు యూదా పట్టణములను పాడుగాను నిర్జనముగాను చేయుదును.

యిర్మియా 42:18 ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునా కోప మును నా ఉగ్రతయు యెరూషలేము నివాసుల మీదికి వచ్చినట్లు, మీరు ఐగుప్తునకు వెళ్లినయెడల నా ఉగ్రత మీమీదికిని వచ్చును, మీరు శాపాస్పదముగాను భీతి పుట్టించువారుగాను దూషణాస్పదముగాను తిరస్కరింపబడువారుగాను ఉందురు, ఈ స్థలమును మరి యెప్పుడును చూడరు.

యిర్మియా 44:2 నేను యెరూషలేము మీదికిని యూదా పట్టణములన్నిటి మీదికిని రప్పించిన కీడంతయు మీరు చూచుచునే యున్నారు.

యిర్మియా 50:17 ఇశ్రాయేలువారు చెదిరిపోయిన గొఱ్ఱలు సింహములు వారిని తొలగగొట్టెను మొదట అష్షూరురాజు వారిని భక్షించెను కడపట బబులోను రాజైన యీ నెబుకద్రెజరు వారి యెముకలను నలుగగొట్టుచున్నాడు.

యిర్మియా 51:34 బబులోనురాజైన నెబుకద్రెజరు మమ్మును మింగివేసెను మమ్మును నుగ్గుచేసెను, మమ్మును వట్టికుండవలె ఉంచియున్నాడు భుజంగము మింగునట్లు మమ్మును మింగెను మా శ్రేష్ఠపదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మును పారవేసియున్నాడు.

విలాపవాక్యములు 1:14 కాడి కట్టినట్లుగా తానే నా యపరాధములను నాకు కట్టియున్నాడు అవి పైనవేయబడినవై నా మెడమీదికెక్కెను నా బలమును ఆయన బలహీనతగా చేసియున్నాడు ప్రభువు శత్రువులచేతికి నన్ను అప్పగించియున్నాడు నేను వారియెదుట లేవలేకపోతిని.

యెహెజ్కేలు 4:2 మరియు అది ముట్టడి వేయబడినట్లును దానియెదుట బురుజులను కట్టినట్లును దిబ్బ వేసినట్లును దాని చుట్టునున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లును నీవు వ్రాయుము.

యెహెజ్కేలు 36:3 వచనమెత్తి ఈలాగు ప్రవచింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా శేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగునట్లుగాను, నిందించువారిచేత జనుల దృష్టికి మీరు అపహాస్యాస్పదమగునట్లుగాను, నలుదిక్కుల మీ శత్రువులు మిమ్మను పట్టుకొన నాశించి మిమ్మును పాడుచేసియున్నారు.

యెహెజ్కేలు 40:1 మనము చెరలోనికి వచ్చిన యిరువదియైదవ సంవత్సరము మొదటి నెల పదియవ దినమున, అనగా పట్టణము కొల్లపోయిన పదునాలుగవ సంవత్సరమున ఆ దినముననే యెహోవా హస్తము నా మీదికి రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకొనిపోయెను.