Logo

నిర్గమకాండము అధ్యాయము 1 వచనము 13

నిర్గమకాండము 1:14 వారు ఇశ్రాయేలీయులచేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతిపనిలోను కఠినసేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి.

నిర్గమకాండము 3:9 ఇశ్రాయేలీయుల మొర నిజముగా నాయొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని.

లేవీయకాండము 25:43 నీ దేవునికి భయపడి అట్టివానిని కఠినముగా చూడకుము.

2సమూయేలు 7:10 మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండ తమ స్వస్థలమందు నివసించునట్లు దానియందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జనులమీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచు వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టకయుండునట్లుగా చేసి

1రాజులు 12:11 నా తండ్రి మీమీద బరువైన కాడిని పెట్టెను సరే, నేను ఆ కాడిని ఇంక బరువుగా చేయుదును; నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెను సరే, నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును.

1దినవృత్తాంతములు 17:9 మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరచి వారిని నాటుదును, వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు, పూర్వమందు జరిగినట్లును, నా జనులైన ఇశ్రాయేలీయులమీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలము మొదలుకొని జరుగుచు వచ్చినట్లును, దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు;

2దినవృత్తాంతములు 10:4 నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మామీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులుకన చేసినయెడల మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవిచేయగా

2దినవృత్తాంతములు 10:11 నా తండ్రి బరువైన కాడి మీమీద మోపెను గాని నేను మీ కాడిని మరింత బరువు చేయుదును; నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెను గాని నేను కొరడాలతో మిమ్మును దండించెదనని చెప్పుము.

యోబు 24:12 జనముగల పట్టణములో మూలుగుదురు గాయపరచబడినవారు మొఱ్ఱపెట్టుదురు అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు.

కీర్తనలు 107:39 వారు బాధవలనను ఇబ్బందివలనను దుఃఖమువలనను తగ్గిపోయినప్పుడు

ప్రసంగి 4:1 పిమ్మట సూర్యునిక్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని. బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు; వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడును లేకపోయెను.

యెషయా 52:5 నా జనులు ఊరకయే కొనిపోబడియున్నారు వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు ఇదే యెహోవా వాక్కు దినమెల్ల నా నామము దూషింపబడుచున్నది

యెహెజ్కేలు 34:4 బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగము గలవాటిని స్వస్థపరచరు, గాయపడినవాటికి కట్టుకట్టరు, తోలివేసినవాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు.

యోహాను 8:33 వారు మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికిని దాసులమై యుండలేదే; మీరు స్వతంత్రులుగా చేయబడుదురని యేల చెప్పుచున్నావని ఆయనతో అనిరి.

ప్రకటన 11:8 వారి శవములు ఆ మహాపట్టణపు సంతవీధిలో పడియుండును; వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు; అచ్చట వారి ప్రభువు కూడ సిలువవేయబడెను.