Logo

నిర్గమకాండము అధ్యాయము 10 వచనము 18

నిర్గమకాండము 8:30 ఫరోయొద్దనుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను.

నిర్గమకాండము 8:9 అందుకు మోషే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును, ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీమీదను నీ యిండ్లలోను ఉండకుండ చంపబడునట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని అతడు ఫరోను అడుగగా అతడు రేపే అనెను

నిర్గమకాండము 8:28 అందుకు ఫరో మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలినర్పించుటకు మిమ్మును పోనిచ్చెదను గాని దూరము పోవద్దు; మరియు నాకొరకు వేడుకొనుడనెను.

నిర్గమకాండము 8:29 అందుకు మోషే నేను నీయొద్దనుండి వెళ్లి రేపు ఈ యీగల గుంపులు ఫరోయొద్దనుండియు అతని సేవకులయొద్దనుండియు అతని జనులయొద్దనుండియు తొలగిపోవునట్లు యెహోవాను వేడుకొందును గాని యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనియ్యక ఇకను వంచన చేయకూడదని చెప్పి

మత్తయి 5:44 నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.

లూకా 6:28 మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించువారికొరకు ప్రార్థన చేయుడి.

నిర్గమకాండము 8:12 మోషే అహరోనులు ఫరోయొద్దనుండి బయలువెళ్లినప్పుడు యెహోవా ఫరోమీదికి రాజేసిన కప్పల విషయములో మోషే అతనికొరకు మొఱపెట్టగా

నిర్గమకాండము 9:33 మోషే ఫరోను విడిచి ఆ పట్టణమునుండి బయలువెళ్లి యెహోవావైపు తనచేతులు ఎత్తినప్పుడు ఆ యురుములును వడగండ్లును నిలిచిపోయెను, వర్షము భూమిమీద కురియుట మానెను.