Logo

నిర్గమకాండము అధ్యాయము 21 వచనము 33

కీర్తనలు 9:15 తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడియున్నది.

కీర్తనలు 119:85 నీ ధర్మశాస్త్రము ననుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి.

సామెతలు 28:10 యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును యథార్థవంతులు మేలైనదానిని స్వతంత్రించుకొందురు.

ప్రసంగి 10:8 గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును; కంచె కొట్టువానిని పాము కరుచును.

యిర్మియా 18:20 వారు నా ప్రాణము తీయవలెనని గుంట త్రవ్వియున్నారు; చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలెనా? వారికి మేలు కలుగవలెనని వారిమీదనుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారిపక్షముగా మాటలాడిన సంగతి జ్ఞాపకము చేసికొనుము.

యిర్మియా 18:22 నన్ను పట్టుకొనుటకు వారు గొయ్యి త్రవ్విరి, నా కాళ్లకు ఉరులనొగ్గిరి; వారిమీదికి నీవు ఆకస్మికముగా దండును రప్పించుటవలన వారి యిండ్లలోనుండి కేకలు వినబడును గాక.

నిర్గమకాండము 22:6 అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుటవలన పంట కుప్పయైనను పంటపైరైనను చేనైనను కాలిపోయినయెడల అగ్ని నంటించినవాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను.

లేవీయకాండము 24:21 జంతువును చావగొట్టినవాడు దాని నష్టము నిచ్చుకొనవలెను. నరహత్య చేసినవానికి మరణశిక్ష విధింపవలెను.