Logo

నిర్గమకాండము అధ్యాయము 30 వచనము 4

నిర్గమకాండము 25:12 దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి, ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వేయవలెను.

నిర్గమకాండము 25:14 వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కలమీది ఉంగరములలో ఆ మోతకఱ్ఱలను దూర్చవలెను.

నిర్గమకాండము 25:27 బల్ల మోయుటకు మోతకఱ్ఱలు ఉంగరములును బద్దెకు సమీపముగా నుండవలెను.

నిర్గమకాండము 26:29 ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకఱ్ఱలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకఱ్ఱలకును బంగారు రేకును పొదిగింపవలెను.

నిర్గమకాండము 27:4 మరియు వలవంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను.

నిర్గమకాండము 27:7 ఆ మోతకఱ్ఱలను ఆ ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకఱ్ఱలు దాని రెండుప్రక్కల నుండవలెను.

నిర్గమకాండము 27:6 మరియు బలిపీఠము కొరకు మోతకఱ్ఱలను చేయవలెను. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను.