Logo

నిర్గమకాండము అధ్యాయము 31 వచనము 1

నిర్గమకాండము 35:1 మోషే ఇశ్రాయేలీయుల సర్వసమాజమును పోగుచేసి మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా

నిర్గమకాండము 35:10 మరియు వివేక హృదయులందరు వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నియు చేయవలెను.

నిర్గమకాండము 36:1 పరిశుద్ధస్థలముయొక్క సేవనిమిత్తము ప్రతివిధమైన పనిచేయ తెలిసికొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసెనో అట్టి బెసలేలును అహోలీయాబును మొదలైన ప్రజ్ఞావంతులందరును యెహోవా ఆజ్ఞాపించిన అంతటిచొప్పున చేయుదురనెను.

నిర్గమకాండము 38:22 యూదా గోత్రికుడైన హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను.

సంఖ్యాకాండము 3:31 వారు మందసము బల్ల దీపవృక్షము వేదికలు తాము సేవ చేయు పరిశుద్ధస్థలములోని ఉపకరణములు అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరుపవలసినవారు.