Logo

నిర్గమకాండము అధ్యాయము 36 వచనము 20

నిర్గమకాండము 26:15 మరియు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేయవలెను.

నిర్గమకాండము 26:16 పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర యుండవలెను.

నిర్గమకాండము 26:17 ప్రతి పలకలో ఒకదానికొకటి సరియైన రెండు కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికి చేసి పెట్టవలెను.

నిర్గమకాండము 26:18 ఇరువది పలకలు కుడివైపున, అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను.

నిర్గమకాండము 26:19 మరియు నొక్కొక్క పలకక్రింద దాని దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ యిరువది పలకల క్రింద నలువది వెండి దిమ్మలను చేయవలెను.

నిర్గమకాండము 26:20 మందిరపు రెండవ ప్రక్కను, అనగా ఉత్తరదిక్కున,

నిర్గమకాండము 26:21 ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మలు ఇరువది పలకలును వాటి నలువది వెండి దిమ్మలు ఉండవలెను.

నిర్గమకాండము 26:22 పడమటితట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు ఆరు పలకలను చేయవలెను.

నిర్గమకాండము 26:23 మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేయవలెను.

నిర్గమకాండము 26:24 అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితోఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను, అవి రెండు మూలలకుండును.

నిర్గమకాండము 26:25 పలకలు ఎనిమిది; వాటి వెండి దిమ్మలు పదునారు; ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మలుండవలెను.

నిర్గమకాండము 40:18 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలువబెట్టి దాని పెండెబద్దలను చొనిపి దాని స్తంభములను నిలువబెట్టి

నిర్గమకాండము 40:19 మందిరముమీద గుడారమును పరచి దానిపైని గుడారపు కప్పును వేసెను.

నిర్గమకాండము 25:5 ఎరుపురంగు వేసిన పొట్టేళ్లతోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱలు,

నిర్గమకాండము 25:10 వారు తుమ్మకఱ్ఱతో నొక మందసమును చేయవలెను. దాని పొడుగు రెండు మూరలునర, దాని వెడల్పు మూరెడునర, దాని యెత్తు మూరెడునర

సంఖ్యాకాండము 25:1 అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి.

ద్వితియోపదేశాకాండము 10:3 కాబట్టి నేను తుమ్మకఱ్ఱతో ఒక మందసమును చేయించి మునుపటి వాటివంటి రెండు రాతిపలకలను చెక్కి ఆ రెండు పలకలను చేతపట్టుకొని కొండ యెక్కితిని.

నిర్గమకాండము 36:21 పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర.

సంఖ్యాకాండము 3:36 మెరారి కుమారులు మందిరము యొక్క పలకలను దాని అడ్డకఱ్ఱలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని ఉపకరణములన్నిటిని దాని సేవకొరకైనవన్నిటిని