Logo

సంఖ్యాకాండము అధ్యాయము 4 వచనము 2

సంఖ్యాకాండము 3:19 కహాతు కుమారుల వంశకర్తల పేళ్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు అనునవి.

సంఖ్యాకాండము 3:27 కహాతు వంశమేదనగా, అమ్రామీయుల వంశము ఇస్హారీయుల వంశము హెబ్రోనీయుల వంశము ఉజ్జీయేలీయుల వంశము; ఇవి కహాతీయుల వంశములు.

సంఖ్యాకాండము 4:34 అప్పుడు మోషే అహరోనులు సమాజప్రధానులను కహాతీయులను, అనగా వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను ముప్పది యేండ్లు మొదలుకొని

యెహోషువ 21:10 అవి లేవీయులైన కహాతీయుల వంశము లలో అహరోను వంశకులకు కలిగినవి, ఏలయనగా మొదటచేతికివచ్చిన వంతుచీటి వారిది.

1దినవృత్తాంతములు 15:2 మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పి వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను.

1దినవృత్తాంతములు 23:3 అప్పుడు లేవీయులు ముప్పది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సు గలవారు కవిలెలో చేర్చబడిరి; వారి సంఖ్య ముప్పది యెనిమిది వేల పురుషులు.

2దినవృత్తాంతములు 29:12 అప్పుడు కహాతీయులలో అమాశై కుమారుడైన మహతు అజర్యా కుమారుడైన యోవేలు, మెరారీయులలో అబ్దీ కుమారుడైన కీషు యెహాల్లెలేలు కుమారుడైన అజర్యా, గెర్షోనీయులలో జిమ్మా కుమారుడైన యోవాహు యోవాహు కుమారుడైన ఏదేను