Logo

సంఖ్యాకాండము అధ్యాయము 4 వచనము 44

సంఖ్యాకాండము 4:36 వారి వారి వంశములచొప్పున వారిలో లెక్కింపబడిన వారు రెండువేల ఏడువందల ఏబదిమంది.

సంఖ్యాకాండము 4:40 తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను వారిలో లెక్కింపబడిన వారు రెండువేల ఆరువందల ముప్పదిమంది.

సంఖ్యాకాండము 3:22 వారిలో లెక్కింపబడినవారు అనగా ఒక నెల మొదలుకొని పై ప్రాయముగల మగవారందరిలో లెక్కింపబడినవారు ఏడువేల ఐదువందలమంది.

సంఖ్యాకాండము 3:28 ఒక నెల మొదలుకొని పై ప్రాయముగల మగవారందరి లెక్కచూడగా ఎనిమిదివేల ఆరువందలమంది పరిశుద్ధస్థలమును కాపాడవలసినవారైరి.

సంఖ్యాకాండము 3:24 గెర్షోనీయుల పితరుల కుటుంబములో లాయేలు కుమారుడైన ఎలీయాసాపు ప్రధానుడు.

సంఖ్యాకాండము 3:34 వారిలో లెక్కింపబడిన వారెందరనగా, ఒక నెల మొదలుకొని పై ప్రాయముగల మగవారందరు ఆరువేల రెండువందలమంది.

ద్వితియోపదేశాకాండము 33:25 నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై యుండును. నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును.

1కొరిందీయులకు 10:13 సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.

1కొరిందీయులకు 12:8 ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞాన వాక్యమును,

1కొరిందీయులకు 12:9 మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను

1కొరిందీయులకు 12:10 మరియొకనికి అద్భుతకార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి.

1కొరిందీయులకు 12:11 అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.

1కొరిందీయులకు 12:12 ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములైయున్నను ఒక్క శరీరమైయున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు.

2కొరిందీయులకు 12:9 అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును

2కొరిందీయులకు 12:10 నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను.

నిర్గమకాండము 27:6 మరియు బలిపీఠము కొరకు మోతకఱ్ఱలను చేయవలెను. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను.