Logo

సంఖ్యాకాండము అధ్యాయము 10 వచనము 17

సంఖ్యాకాండము 1:51 మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాని విప్పవలెను, మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను. అన్యుడు సమీపించినయెడల వాడు మరణశిక్ష నొందును.

హెబ్రీయులకు 9:11 అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా

హెబ్రీయులకు 12:28 అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప కలిగియుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము,

2పేతురు 1:14 నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను.

సంఖ్యాకాండము 3:25 ప్రత్యక్షపు గుడారములో గెర్షోను కుమారులు కాపాడవలసినవేవనగా, మందిరము గుడారము దాని పైకప్పు ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెరయు

సంఖ్యాకాండము 3:26 ప్రాకార యవనికలు మందిరమునకును బలిపీఠమునకును చుట్టునున్న ప్రాకార ద్వారపు తెరయు దాని సమస్త సేవ కొరకైన త్రాళ్లును.

సంఖ్యాకాండము 3:36 మెరారి కుమారులు మందిరము యొక్క పలకలను దాని అడ్డకఱ్ఱలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని ఉపకరణములన్నిటిని దాని సేవకొరకైనవన్నిటిని

సంఖ్యాకాండము 3:37 దాని చుట్టునున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను కాపాడవలసినవారు.

సంఖ్యాకాండము 4:24 పనిచేయుటయు మోతలు మోయుటయు గెర్షోనీయుల సేవ;

సంఖ్యాకాండము 4:25 వారు మందిరముయొక్క తెరలను ప్రత్యక్షపు గుడారమును దాని కప్పును దాని పైనున్న సముద్రవత్సల చర్మమయమైన పైకప్పును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారపు తెరను ప్రాకార తెరలను

సంఖ్యాకాండము 4:26 మందిరముచుట్టును బలిపీఠముచుట్టును ఉండు ప్రాకారపు గవిని ద్వారపు తెరలను వాటి త్రాళ్లను వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నిటిని వాటికొరకు చేయబడినది యావత్తును మోయుచు పనిచేయుచు రావలెను.

సంఖ్యాకాండము 4:27 గెర్షోనీయుల పని అంతయు, అనగా తాము మోయువాటినన్నిటిని చేయు పనియంతటిని అహరోను యొక్కయు అతని కుమారుల యొక్కయు నోటిమాటచొప్పున జరుగవలెను. వారు జరుపువాటినన్నిటిని జాగ్రత్తగా చూచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను.

సంఖ్యాకాండము 4:28 ప్రత్యక్షపు గుడారములో గెర్షోనీయులయొక్క పని యిది; వారు పనిచేయుచు యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతిక్రింద నుండవలెను.

సంఖ్యాకాండము 4:29 మెరారీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలెను.

సంఖ్యాకాండము 4:30 ముప్పది యేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరువారందరిని లెక్కింపవలెను.

సంఖ్యాకాండము 4:31 ప్రత్యక్షపు గుడారములో వారు చేయు పని అంతటి విషయములో వారు, మందిరపు పలకలను దాని అడ్డకఱ్ఱలను దాని స్తంభములను

సంఖ్యాకాండము 4:32 దాని దిమ్మలను దాని చుట్టునున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను వాటి ఉపకరణములన్నిటిని వాటి సంబంధమైన పనియంతటికి కావలసినవన్నిటిని వారు మోసి కాపాడవలసిన బరువులను పేర్ల వరుసను లెక్కింపవలెను.

సంఖ్యాకాండము 4:33 మెరారీయుల వంశములు ప్రత్యక్షపు గుడారములో యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతిక్రింద చేయవలసిన సేవ యిది; అంతే వారు చేయవలసిన సేవ అని చెప్పెను.

సంఖ్యాకాండము 7:6 మోషే ఆ బండ్లను ఆ యెద్దులను తీసికొని లేవీయులకిచ్చెను.

సంఖ్యాకాండము 7:7 అతడు రెండు బండ్లను నాలుగు ఎద్దులను వారి వారి సేవచొప్పున గెర్షోనీయులకిచ్చెను.

సంఖ్యాకాండము 7:8 అతడు నాలుగు బండ్లను ఎనిమిది యెద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతిక్రింద సేవచేయు మెరారీయులకు వారి వారి సేవచొప్పున ఇచ్చెను.

నిర్గమకాండము 25:28 ఆ మోతకఱ్ఱలు తుమ్మకఱ్ఱతో చేసి వాటిమీద బంగారు రేకు పొదిగింపవలెను; వాటితో బల్ల మోయబడును.

సంఖ్యాకాండము 2:17 ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాళెముతో పాళెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములనుబట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవవలెను.

సంఖ్యాకాండము 3:8 మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారముయొక్క ఉపకరణములన్నిటిని, ఇశ్రాయేలీయులు కాపాడవలసినదంతటిని, వారే కాపాడవలెను.

సంఖ్యాకాండము 10:21 కహాతీయులు పరిశుద్ధమైనవాటిని మోయుచు సాగిరి; అందరు వచ్చులోగా వారు మందిరమును నిలువబెట్టిరి.

1దినవృత్తాంతములు 6:47 షమెరు మహలి కుమారుడు, మహలి మూషి కుమారుడు, మూషి మెరారి కుమారుడు, మెరారి లేవి కుమారుడు.

1దినవృత్తాంతములు 23:24 వీరు తమ పితరుల యింటివారినిబట్టి లేవీయులుగా ఎంచబడిరి; పితరుల యిండ్లకు పెద్దలైన వీరు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సు గలవారై తమ తమ పేరుల లెక్కప్రకారము ఒక్కొక్కరుగా నెంచబడి యెహోవా మందిరపు సేవచేయు పనివారైయుండిరి.