Logo

సంఖ్యాకాండము అధ్యాయము 10 వచనము 25

సంఖ్యాకాండము 2:25 దాను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున ఉత్తరదిక్కున ఉండవలెను. అమీషదాయి కుమారుడైన అహీయెజెరు దాను కుమారులకు ప్రధానుడు.

సంఖ్యాకాండము 2:28 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు నలుబది యొకవేయి ఐదువందలమంది.

సంఖ్యాకాండము 2:29 అతని సమీపమున నఫ్తాలి గోత్రికులుండవలెను. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమారులకు ప్రధానుడు.

సంఖ్యాకాండము 2:30 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ఏబది మూడువేల నాలుగువందలమంది.

సంఖ్యాకాండము 2:31 దాను పాళెములో లెక్కింపబడిన వారందరు లక్ష యేబది యేడువేల ఆరువందలమంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను.

సంఖ్యాకాండము 26:42 దాను పుత్రుల వంశములలో షూషామీయులు షూషాము వంశస్థులు;

సంఖ్యాకాండము 26:43 వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల నాలుగువందలమంది.

సంఖ్యాకాండము 26:44 ఆషేరు పుత్రుల వంశములలో యిమ్నీయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు; బెరీయులు బెరీయా వంశస్థులు;

సంఖ్యాకాండము 26:45 బెరీయానీయులలో హెబెరీయులు హెబెరు వంశస్థులు; మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు;

సంఖ్యాకాండము 26:46 ఆషేరు కుమార్తె పేరు శెరహు.

సంఖ్యాకాండము 26:47 వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు; వీరు ఏబది మూడువేల నాలుగువందలమంది.

సంఖ్యాకాండము 26:48 నఫ్తాలీ పుత్రుల వంశములలో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు; గూనీయులు గూనీ వంశస్థులు;

సంఖ్యాకాండము 26:49 యేసెరీయులు యేసెరు వంశస్థులు; షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు.

సంఖ్యాకాండము 26:50 వీరు నఫ్తాలీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు నలుబది యయిదువేల నాలుగువందలమంది

సంఖ్యాకాండము 26:51 ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వీరు ఆరులక్షల వెయ్యిన్ని ఏడువందల ముప్పదిమంది.

ఆదికాండము 49:16 దాను ఇశ్రాయేలు గోత్రికులవలె తన ప్రజలకు న్యాయము తీర్చును.

ఆదికాండము 49:17 దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుఱ్ఱపు మడిమెలు కరచును అందువలన ఎక్కువాడు వెనుకకు పడును.

ద్వితియోపదేశాకాండము 25:17 మీరు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసినదానిని జ్ఞాపకము చేసికొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి

ద్వితియోపదేశాకాండము 25:18 నీవు ప్రయాసవడి అలసియున్నప్పుడు నీవారిలో నీ వెనుకనున్న బలహీనులనందరిని హతముచేసెను.

యెహోషువ 6:9 యోధులు బూరల నూదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను, యాజకులు వెళ్లుచు బూరలను ఊదుచుండిరి.

యెషయా 52:12 మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవురీతిగా వెళ్లరు. యెహోవా మీ ముందర నడచును ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును

యెషయా 58:8 వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువచుక్కవలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.

సంఖ్యాకాండము 1:12 దాను గోత్రములో ఆమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు

సంఖ్యాకాండము 7:66 పదియవ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీషదాయి కుమారుడును దానీయులకు ప్రధానుడునైన అహీయెజెరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి

ఆదికాండము 46:23 దాను కుమారుడైన హుషీము.

సంఖ్యాకాండము 2:31 దాను పాళెములో లెక్కింపబడిన వారందరు లక్ష యేబది యేడువేల ఆరువందలమంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను.