Logo

సంఖ్యాకాండము అధ్యాయము 18 వచనము 16

సంఖ్యాకాండము 3:47 పరిశుద్ధమైన తులముచొప్పున వాటిని తీసికొనవలెను.

లేవీయకాండము 27:2 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఒకడు విశేషమైన మ్రొక్కుబడి చేసినయెడల నీవు నిర్ణయించిన వెలచొప్పున వారు యెహోవాకు దాని చెల్లింపవలెను.

లేవీయకాండము 27:3 నీవు నిర్ణయింపవలసిన వెల యేదనగా, ఇరువది ఏండ్లు మొదలుకొని అరువది ఏండ్ల వయస్సు వరకు మగవానికి పరిశుద్ధస్థలముయొక్క తులమువంటి యేబది తులముల వెండి నిర్ణయింపవలెను.

లేవీయకాండము 27:4 ఆడుదానికి ముప్పది తులములు నిర్ణయింపవలెను.

లేవీయకాండము 27:5 అయిదేండ్లు మొదలుకొని యిరువది ఏండ్లలోపలి వయస్సుగల మగవానికి ఇరువది తులముల వెలను, ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను.

లేవీయకాండము 27:6 ఒక నెల మొదలుకొని అయిదేండ్లలోపలి వయస్సుగల మగవానికి అయిదు తులముల వెండి వెలను ఆడుదానికి మూడు తులముల వెండి వెలను నిర్ణయింపవలెను.

లేవీయకాండము 27:7 అరువది ఏండ్ల ప్రాయముదాటిన మగవానికి పదునైదు తులముల వెలను ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను.

నిర్గమకాండము 30:13 వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధస్థలముయొక్క తులమునుబట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము యిరువది చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్ఠార్పణ.

లేవీయకాండము 27:25 నీ వెలలన్నియు పరిశుద్ధ స్థలముయొక్క వెలచొప్పున నిర్ణయింపవలెను. ఒక తులము ఇరువది చిన్నములు.

యెహెజ్కేలు 45:12 తులమొకటింటికి ఇరువది చిన్నముల యెత్తును, అరవీసె యొకటింటికి ఇరువది తులముల యెత్తును, ఇరువదియైదు తులముల యెత్తును పదునైదు తులముల యెత్తును ఉండవలెను.

నిర్గమకాండము 13:13 ప్రతి గాడిద తొలిపిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొఱ్ఱపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించనియెడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలియైన ప్రతి మగవానిని వెలయిచ్చి విడిపింపవలెను.

నిర్గమకాండము 38:24 పరిశుద్ధస్థల విషయమైన పని అంతటిలోను పనికొరకు వ్యయపరచబడిన బంగారమంతయు, అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధస్థలపు తులముచొప్పున నూట పదహారు మణుగుల ఐదువందల ముప్పది తులములు.

లేవీయకాండము 27:3 నీవు నిర్ణయింపవలసిన వెల యేదనగా, ఇరువది ఏండ్లు మొదలుకొని అరువది ఏండ్ల వయస్సు వరకు మగవానికి పరిశుద్ధస్థలముయొక్క తులమువంటి యేబది తులముల వెండి నిర్ణయింపవలెను.

సంఖ్యాకాండము 3:15 లేవీయుల పితరుల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపుము. ఒక నెల మొదలుకొని పై ప్రాయముగల మగవారినందరిని లెక్కింపవలెను.

నెహెమ్యా 10:36 మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలులను, ధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను, మన దేవుని మందిరములో సేవచేయు యాజకులయొద్దకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి.