Logo

సంఖ్యాకాండము అధ్యాయము 18 వచనము 28

ఆదికాండము 14:18 మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసికొనివచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు.

హెబ్రీయులకు 6:20 నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధానయాజకుడైన యేసు అందులోనికి మనకంటె ముందుగా మన పక్షమున ప్రవేశించెను.

హెబ్రీయులకు 7:1 రాజులను సంహారము చేసి, తిరిగి వచ్చుచున్న అబ్రాహామును

హెబ్రీయులకు 7:2 ఎవడు కలిసికొని అతనిని ఆశీర్వదించెనో, యెవనికి అబ్రాహాము అన్నిటిలో పదియవ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము.

హెబ్రీయులకు 7:3 అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది యైనను జీవనమునకు అంతమైనను లేనివాడునై యుండి దేవుని కుమారుని పోలియున్నాడు.

హెబ్రీయులకు 7:4 ఇతడెంత ఘనుడో చూడుడి. మూలపురుషుడైన అబ్రాహాము అతనికి కొల్లగొన్న శ్రేష్ఠమైన వస్తువులలో పదియవ వంతు ఇచ్చెను.

హెబ్రీయులకు 7:5 మరియు లేవి కుమాళ్లలోనుండి యాజకత్వము పొందువారు, తమ సహోదరులు అబ్రాహాము గర్భవాసమునుండి పుట్టినను, ధర్మశాస్త్రము చొప్పున వారియొద్ద, అనగా ప్రజలయొద్ద పదియవ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొందియున్నారు గాని

హెబ్రీయులకు 7:6 వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రాహాము నొద్ద పదియవ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందినవానిని ఆశీర్వదించెను.

హెబ్రీయులకు 7:7 తక్కువవాడు ఎక్కువ వానిచేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమైయున్నది.

హెబ్రీయులకు 7:8 మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైనవారు పదియవ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా, జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు.

హెబ్రీయులకు 7:9 అంతేకాక ఒక విధమున చెప్పినయెడల పదియవ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రాహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను.

హెబ్రీయులకు 7:10 ఏలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలిసికొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను.

సంఖ్యాకాండము 18:30 మరియు నీవు వారితో మీరు దానిలోనుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత మిగిలినది కళ్లపు వచ్చుబడివలెను ద్రాక్షతొట్టి వచ్చుబడివలెను లేవీయులదని యెంచవలెను.