లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 7: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" యెదీయవేలు కుమారులైన వీరందరును తమ పితరుల యిండ్లకు పెద్దలు; వీరిలో యుద్ధమునకు పోతగిన పరాక్రమశాలులు పదునైదువేల రెండు వందలమంది యుండిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

2దినవృత్తాంతములు 17:13

యూదాదేశపు పట్టణములలో అతనికి బహు ధనము సమకూర్చబడెను. అతనిక్రింది పరాక్రమశాలులు యెరూషలేములో కూడియుండిరి.

2దినవృత్తాంతములు 17:14

వీరి పితరుల వంశములచొప్పున వీరి సంఖ్య యెంతనగా, యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నాయొద్ద మూడు లక్షలమంది పరాక్రమశాలులుండిరి.

2దినవృత్తాంతములు 17:15

రెండవవాడగు యెహోహానాను అను అధిపతియొద్ద రెండు లక్షల ఎనుబదివేలమంది యుండిరి.

2దినవృత్తాంతములు 17:16

మూడవవాడు జిఖ్రీ కుమారుడై యెహోవాకు తన్నుతాను మనఃపూర్వకముగా సమర్పించుకొనిన అమస్యా; అతనియొద్ద రెండు లక్షలమంది పరాక్రమశాలులుండిరి.

2దినవృత్తాంతములు 17:17

బెన్యామీనీయులలో ఎల్యాదా అను పరాక్రమశాలి యొకడుండెను; వీనియొద్ద వింటిని కేడెమును పట్టుకొనువారు రెండు లక్షలమంది యుండిరి.

2దినవృత్తాంతములు 17:18

రెండవవాడు యెహోజాబాదు; వీనియొద్ద లక్షయెనుబదివేలమంది యుద్ధసన్నద్ధులుండిరి.

2దినవృత్తాంతములు 17:19

రాజు యూదాయందంతటనుండు ప్రాకార పురములలో ఉంచినవారు గాక వీరు రాజుయొక్క పరివారములో చేరినవారై యుండిరి.

1దినవృత్తాంతములు 7:6

బెన్యామీను కుమారులు ముగ్గురు; బెల బేకరు యెదీయవేలు.