లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 7: 6

క్రాస్-రిఫరెన్స్‌లు

" బెన్యామీను కుమారులు ముగ్గురు; బెల బేకరు యెదీయవేలు."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 8:1

బన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, రెండవవాడు అష్బేలు,

1దినవృత్తాంతములు 8:2

మూడవవాడు అహరహు, నాల్గవవాడు నోహా, అయిదవవాడు రాపా.

1దినవృత్తాంతములు 8:3

బెలకు పుట్టిన కుమారులు అద్దారు గెరా అబీహూదు

1దినవృత్తాంతములు 8:4

అబీషూవ నయమాను అహోయహు

1దినవృత్తాంతములు 8:5

గెరా షెపూపాను హూరాము

1దినవృత్తాంతములు 8:6

ఏహూదు కనిన కుమారులు ఉజ్జా అహీ హూదు, వారు గెబ కాపురస్థులకు ఇంటిపెద్దలుగా నుండిరి;

1దినవృత్తాంతములు 8:7

నయమాను అహీయా గెరా అనువారు వారిని మనహతునకు చెరతీసికొనిపోయిరి, గెరా వారిని అచ్చటికి చెరతీసికొనిపోయెను.

1దినవృత్తాంతములు 8:8

వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమందు హుషీము బయరా అను తన భార్యలయందు కనిన పిల్లలుగాక

1దినవృత్తాంతములు 8:9

తన భార్యయైన హోదెషునందు యోబాబును జిబ్యాను మేషాను మల్కామును

1దినవృత్తాంతములు 8:10

యెపూజును షాక్యాను మిర్మాను కనెను, వీరు అతని కుమారులు; వారు తమ పితరుల యిండ్లకు పెద్దలుగా ఉండిరి.

1దినవృత్తాంతములు 8:11

హుషీము అను దానియందు అతడు అహీటూబును ఎల్పయలును కనెను.

1దినవృత్తాంతములు 8:12

ఎల్పయలు కుమారులు ఏబెరు మిషాము షెమెదు, షెమెదు ఓనోను లోదును దాని గ్రామములను కట్టించెను.

ఆదికాండము 46:21

బెన్యామీను కుమారులైన బెల బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహీరోషు ముప్పీము హుప్పీము ఆర్దు.

సంఖ్యాకాండము 26:38

బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెల వంశస్థులు; అష్బేలీయులు అష్బేల వంశస్థులు;

సంఖ్యాకాండము 26:39

అహీరామీయులు అహీరాము వంశస్థులు;

సంఖ్యాకాండము 26:40

షూపామీయులు షూపాము వంశస్థులు; బెల కుమారులు ఆర్దు నయమాను; ఆర్దీయులు ఆర్దు వంశస్థులు; నయమానీయులు నయమాను వంశస్థులు.

సంఖ్యాకాండము 26:41

వీరు బెన్యామీనీయుల వంశస్థులు; వారిలో వ్రాయబడిన లెక్కచొప్పున నలుబది యయిదువేల ఆరువందలమంది.

1దినవృత్తాంతములు 7:10

యెదీయవేలు కుమారులలో ఒకడు బిల్హాను. బిల్హాను కుమారులు యూషు బెన్యామీను ఏహూదు కెనయనా జేతాను తర్షీషు అహీషహరు.

1దినవృత్తాంతములు 7:11

యెదీయవేలు కుమారులైన వీరందరును తమ పితరుల యిండ్లకు పెద్దలు; వీరిలో యుద్ధమునకు పోతగిన పరాక్రమశాలులు పదునైదువేల రెండు వందలమంది యుండిరి.