లేఖనాలను అన్వేషించండి

1రాజులు 6: 15

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతడు మందిరపు లోపలి గోడలను అడుగునుండి పైకప్పు వరకు దేవదారు పలకలచేత కట్టించెను; లోపల వాటిని సరళపుమ్రాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేసెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1రాజులు 6:16

మరియు మందిరపు ప్రక్కలను దిగువనుండి గోడల పైభాగము మట్టుకు దేవదారు పలకలతో ఇరువది మూరల యెత్తు కట్టించెను; వీటిని గర్భాలయమునకై, అనగా అతిపరిశుద్దమైన స్థలమునకై అతడు లోపల కట్టించెను

1రాజులు 5:8

సొలొమోనునకు ఈ వర్తమానము పంపెను నీవు నాయొద్దకు పంపిన వర్తమానమును నేను అంగీకరించితిని; దేవదారు మ్రానులను గూర్చియు సరళపు మ్రానులను గూర్చియు నీ కోరిక యంతటి ప్రకారము నేను చేయించెదను.

2దినవృత్తాంతములు 3:5

మందిరపు పెద్ద గదిని దేవదారు పలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారమును పొదిగించి పైభాగమున ఖర్జూరపుచెట్లవంటి పనియు గొలుసులవంటి పనియు చెక్కించి

యెహెజ్కేలు 41:16

మరియు గర్భాలయమును ఆవరణపు మంటపములను గడపలను కమ్ములుగల కిటికీలను ఎదుటి మూడు అంతస్థుల చుట్టునున్న వసారాలను ఆయన కొలిచెను. కిటికీలు మరుగు చేయబడెను, గడపలకెదురుగా నేలనుండి కిటికీలవరకు బల్లకూర్పుండెను