లేఖనాలను అన్వేషించండి

1రాజులు 6: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతోను పలకలతోను కప్పించెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1రాజులు 6:14

ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను.

1రాజులు 6:38

పదునొకండవ సంవత్సరము బూలు అను ఎనిమిదవ మాసమున దాని యేర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోను మందిరము సమాప్తమాయెను. ఏడు సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను.

నిర్గమకాండము 40:33

మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టు ఆవరణమును ఏర్పరచి ఆవరణద్వారపు తెరను వేసెను. ఆలాగున మోషే పని సంపూర్తి చేసెను.

1రాజులు 5:6

లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము; నా సేవకులును నీ సేవకులును కలిసి పనిచేయుదురు; మ్రానులను నరుకుటయందు సీదోనీయులకు సాటియైనవారు మాలో ఎవరును లేరని నీకు తెలియును గనుక