లేఖనాలను అన్వేషించండి

2దినవృత్తాంతములు 10: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" నా తండ్రి బరువైన కాడి మీమీద మోపెను గాని నేను మీ కాడిని మరింత బరువు చేయుదును; నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెను గాని నేను కొరడాలతో మిమ్మును దండించెదనని చెప్పుము."

సంబంధిత రిఫరెన్స్‌లు

2దినవృత్తాంతములు 10:4

నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మామీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులుకన చేసినయెడల మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవిచేయగా

నిర్గమకాండము 1:13

ఇశ్రాయేలీయులచేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి;

నిర్గమకాండము 1:14

వారు ఇశ్రాయేలీయులచేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతిపనిలోను కఠినసేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి.

నిర్గమకాండము 5:5

మరియు ఫరో ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించియున్నది; వారు తమ బరువులను విడిచి తీరికగా నుండునట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను.

నిర్గమకాండము 5:6

ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను

నిర్గమకాండము 5:7

ఇటుకలు చేయుటకు మీరు ఇకమీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్లి తామే గడ్డి కూర్చుకొనవలెను.

నిర్గమకాండము 5:8

అయినను వారు ఇదివరకు చేసిన యిటుకల లెక్కనే వారిమీద మోపవలెను, దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు; వారు సోమరులు గనుక మేము వెళ్లి మా దేవునికి బలినర్పించుటకు సెలవిమ్మని మొఱ పెట్టుచున్నారు

నిర్గమకాండము 5:9

ఆ మనుష్యులచేత ఎక్కువ పని చేయింపవలెను, దానిలో వారు కష్టపడవలెను, అబద్ధపుమాటలను వారు లక్ష్యపెట్టకూడదనెను.

నిర్గమకాండము 5:18

మీరు పొండి, పనిచేయుడి, గడ్డి మీకియ్యబడదు, అయితే ఇటుకల లెక్క మీరప్పగింపక తప్పదని చెప్పెను.

1సమూయేలు 8:18

ఆ దినమున మీరు కోరుకొనిన రాజునుబట్టి మీరు మొఱ్ఱపెట్టినను యెహోవా మీ మొఱ్ఱవినక పోవును అనెను.

యెషయా 47:6

నా జనులమీద కోపపడి నా స్వాస్థ్యము నపవిత్రపరచి వారిని నీచేతికి అప్పగించితిని నీవు వారియందు కనికరపడక వృద్దులమీద నీ కాడిమ్రానును మిక్కిలి బరువుగా మోపితివి.

యెషయా 58:6

దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా?

యిర్మియా 28:13

నీవు పోయి హనన్యాతో ఇట్లనుము యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీవు కొయ్యకాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుపకాడిని చేయించవలెను.

యిర్మియా 28:14

ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ జనులందరును బబులోను రాజైన నెబుకద్రెజరునకు దాసులు కావలెనని వారి మెడమీద ఇనుపకాడి యుంచితిని గనుక వారు అతనికి దాసులగుదురు, భూజంతువులను కూడ నేను అతనికి అప్పగించియున్నాను.

మత్తయి 11:29

నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.

లూకా 10:19

ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీకెంతమాత్రమును హానిచేయదు.

ప్రకటన 9:3

ఆ పొగలోనుండి మిడతలు భూమి మీదికి వచ్చెను, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను.

ప్రకటన 9:5

మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని అయిదు నెలలవరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటివలవ కలుగు బాధ, తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధవలె ఉండును.

ప్రకటన 9:10

తేళ్లతోకలవంటి తోకలును కొండ్లును వాటికుండెను. అయిదు నెలలవరకు వాటి తోకలచేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారముండెను.

1రాజులు 12:10

అప్పుడు అతనితో కూడ ఎదిగిన ఆ యౌవనస్థులు ఈ ఆలోచన చెప్పిరి నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను గాని నీవు దానిని చులకనగా చేయవలెనని నీతో చెప్పుకొనిన యీ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇమ్ము నా తండ్రి నడుముకంటె నా చిటికెన వ్రేలు పెద్దదిగా ఉండును.

2దినవృత్తాంతములు 10:14

వారికి కఠినమైన ప్రత్యుత్తరమిచ్చెను; ఎట్లనగా నా తండ్రి మీ కాడిని బరువుచేసెను, నేను దానిని మరింత బరువు చేయుదును; నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెను, నేను మిమ్మును కొరడాలతో దండించెదనని చెప్పెను.