లేఖనాలను అన్వేషించండి

2దినవృత్తాంతములు 10: 17

క్రాస్-రిఫరెన్స్‌లు

" అయితే యూదా పట్టణములలో కాపురముండు ఇశ్రాయేలువారిమీద రెహబాము ఏలుబడి చేసెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

2దినవృత్తాంతములు 11:1

రెహబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇశ్రాయేలువారితో యుద్ధము చేయుటకును, రాజ్యమును తనకు మరల రప్పించుకొనుటకును అతడు యూదావారిలోనుండియు బెన్యామీనీయులలోనుండియు ఏర్పరచబడిన యుద్ధ శాలులను లక్ష యెనుబది వేలమందిని సమకూర్చగా

1రాజులు 11:36

నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా యెదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడు నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చెదను.

1రాజులు 12:17

అయితే యూదా పట్ణణములలోనున్న ఇశ్రాయేలువారిని రెహబాము ఏలెను.

2సమూయేలు 20:2

ఇశ్రాయేలు వారందరు దావీదును విడిచి బిక్రి కుమారుడైన షెబను వెంబడించిరి. అయితే యొర్దాను నదినుండి యెరూషలేమువరకు యూదావారు రాజును హత్తుకొనిరి.

ప్రసంగి 1:1

దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై యుండిన ప్రసంగి పలికిన మాటలు.

యెహెజ్కేలు 37:16

నరపుత్రుడా, నీవు కఱ్ఱతునక యొకటి తీసికొని దానిమీద యూదావారిదనియు, వారి తోటివారగు ఇశ్రాయేలీయులదనియు పేళ్లు వ్రాయుము. మరియొక తునక తీసికొని దానిమీద ఎఫ్రాయిమునకు తునక, అనగా యోసేపు వంశస్థులదనియు వారి తోటివారగు ఇశ్రాయేలువారిదనియు వ్రాయుము.