2దినవృత్తాంతములు 10: 2
క్రాస్-రిఫరెన్స్‌లు
" రాజైన సొలొమోను సమక్షమునుండి పారిపోయి ఐగుప్తులో వాసము చేయుచున్న నెబాతు కుమారుడైన యరొబాము అది విని ఐగుప్తునుండి తిరిగిరాగా జనులు అతని పిలిపించిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజుమీదికి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయీమీయుడైన నెబాతు కుమారుడు, ఇతని తల్లిపేరు జెరూహా, ఆమె విధవరాలు.
అయితే యరొబాము అను ఇతడు మహా బలాఢ్యుడైయుండగా యౌవనుడగు ఇతడు పనియందు శ్రద్ధగలవాడని సొలొమోను తెలిసికొని, యోసేపు సంతతివారు చేయవలసిన భారమైన పనిమీద అతనిని అధికారిగా నిర్ణయించెను.
జరిగినదానిని విని సొలొమోను యరొబామును చంపచూడగా యరొబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషకునొద్ద చేరి సొలొమోను మరణమగువరకు ఐగుప్తులోనే యుండెను.
నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను నొద్దనుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను; యరొబాము ఇంక ఐగుప్తులోనేయుండి ఆ సమాచారము వినెను.