లేఖనాలను అన్వేషించండి

2దినవృత్తాంతములు 12: 15

క్రాస్-రిఫరెన్స్‌లు

" రెహబాము చేసిన కార్యములన్నిటినిగూర్చియు షెమయా రచించిన గ్రంథమందును దీర్ఘదర్శియైన ఇద్దో రచించిన వంశావళియందును వ్రాయబడియున్నది."

సంబంధిత రిఫరెన్స్‌లు

2దినవృత్తాంతములు 9:29

సొలొమోను చేసిన కార్యములన్నిటినిగూర్చి ప్రవక్తయైన నాతాను రచించిన గ్రంథమందును, షిలోనీయుడైన అహీయా రచించిన ప్రవచన గ్రంథమందును, నెబాతు కుమారుడైన యరొబామునుగూర్చి దీర్ఘదర్శియైన ఇద్దోకు గ్రంథమందును వ్రాయబడియున్నది.

2దినవృత్తాంతములు 12:5

ప్రవక్తయైన షెమయా రెహబామునొద్దకును, షీషకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడియున్న యూదావారి అధిపతులయొద్దకును వచ్చి మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును షీషకుచేతిలో పడనిచ్చియున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను.

1రాజులు 12:22

అంతట దేవుని వాక్కు దైవజనుడగు షెమయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2దినవృత్తాంతములు 9:29

సొలొమోను చేసిన కార్యములన్నిటినిగూర్చి ప్రవక్తయైన నాతాను రచించిన గ్రంథమందును, షిలోనీయుడైన అహీయా రచించిన ప్రవచన గ్రంథమందును, నెబాతు కుమారుడైన యరొబామునుగూర్చి దీర్ఘదర్శియైన ఇద్దోకు గ్రంథమందును వ్రాయబడియున్నది.

2దినవృత్తాంతములు 13:22

అబీయా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతని చర్యనుగూర్చియు, అతని కాలమున జరిగిన సంగతులనుగూర్చియు ప్రవక్తయైన ఇద్దో రచించిన సటీక గ్రంథమునందు వ్రాయబడియున్నది.

1రాజులు 14:30

వారు బ్రదికినంత కాలము రెహబామునకును యరొబామునకును యుద్ధము జరుగుచుండెను.

1రాజులు 14:29

రెహబాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన వాటన్నిటినిగూర్చియు యూదారాజులయొక్క వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

2దినవృత్తాంతములు 11:2

దైవజనుడైన షెమయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2దినవృత్తాంతములు 15:6

దేవుడు జనములను సకలవిధములైన బాధలతో శ్రమపరచెను గనుక జనము జనమును, పట్టణము పట్టణమును, పాడుచేసెను.

2దినవృత్తాంతములు 16:11

ఆసా చేసిన కార్యములన్నిటినిగూర్చి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.

2దినవృత్తాంతములు 20:34

యెహోషాపాతు చేసిన కార్యములన్నిటినిగూర్చి హనానీ కుమారుడైన యెహూ రచించిన గ్రంథమందు వ్రాయబడియున్నది. ఈ యెహూ పేరు, ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు కనబడుచున్నది.

2దినవృత్తాంతములు 26:22

ఉజ్జియా చేసిన యితర కార్యములనుగూర్చి ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా వ్రాసెను.