2దినవృత్తాంతములు 12: 16
క్రాస్-రిఫరెన్స్‌లు
" రెహబామునకును యరొబామునకును యుద్ధము యెడతెగక జరిగెను. రెహబాము తన పితరులతో కూడ నిద్రించి దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను, అతని కుమారుడైన అబీయా అతనికి బదులుగా రాజాయెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
రెహబాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన వాటన్నిటినిగూర్చియు యూదారాజులయొక్క వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
వారు బ్రదికినంత కాలము రెహబామునకును యరొబామునకును యుద్ధము జరుగుచుండెను.
రెహబాము తన పితరులతోకూడ నిద్రించి దావీదు పురమందున్న తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతని తల్లి నయమాయను ఒక అమ్మోనీయురాలు; అతని కుమారుడైన అబీయాము అతనికి మారుగా రాజాయెను.
రాజైన యరొబాము ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు అబీయా యూదావారిమీద ఏలనారంభించెను.
రెహబాము తన పితరులతోకూడ నిద్రించి దావీదు పురమందున్న తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతని తల్లి నయమాయను ఒక అమ్మోనీయురాలు; అతని కుమారుడైన అబీయాము అతనికి మారుగా రాజాయెను.
అబీయాకు ఆసా కుమారుడు, ఆసాకు యెహోషాపాతు కుమారుడు
సొలొమోను రెహబామును కనెను; రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను;
పిమ్మట అతడు అబ్షాలోము కుమార్తెయైన మయకాను వివాహము చేసికొనగా ఆమె అతనికి అబీయాను అత్తయిని జీజాను షెలోమీతును కనెను.
యెహోషాపాతు తన పితరులతోకూడ నిద్రించితన పితరుల చెంతను దావీదు పురమందు పాతిపెట్టబడెను, అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజాయెను.
దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమువారికి సేవచేసి నిద్రించి,