2దినవృత్తాంతములు 12: 9
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఐగుప్తురాజైన షీషకు యెరూషలేముమీదికి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటిని రాజనగరులోని బొక్కసములన్నిటిని దోచుకొని, సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసికొనిపోయెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
రాజైన రెహబాముయొక్క అయిదవ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదికి వచ్చి
యెహోవా మందిరపు ఖజనాలోని పదార్థములను, రాజనగరుయొక్క ఖజనాలోని పదార్థములను, ఎత్తికొనిపోయెను, అతడు సమస్తమును ఎత్తికొనిపోయెను; సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను అతడు ఎత్తికొనిపోయెను.
కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోను రాజనగరుయొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారమంతయు తీసి తన సేవకులచేతి కప్పగించి, హెజ్యోనునకు పుట్టిన టబ్రిమ్మోను కుమారుడును దమస్కులో నివాసము చేయుచు అరామునకు రాజునైయున్న బెన్హదదుకు పంపి మనవి చేసినదేమనగా
నేను నీ దాసుడను నీ కుమారుడనైయున్నాను గనుక నీవు వచ్చి, నామీదికి లేచిన సిరియారాజు చేతిలోనుండియు ఇశ్రాయేలురాజు చేతిలోనుండియు నన్ను రక్షింపవలెనని అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరునొద్దకు దూతలనంపగా
కావున హిజ్కియా యెహోవా మందిరమందును రాజనగరునందున్న పదార్థములలో కనబడిన వెండియంతయు అతనికిచ్చెను.
మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అష్షూరు రాజునకిచ్చెను.
దాని మనోహరమైన వస్తువులన్నియు శత్రువులచేతిలో చిక్కెను నీ సమాజములో ప్రవేశింపకూడదని యెవరినిగూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనములవారు దాని పరిశుద్ధస్థలమున ప్రవేశించియుండుట అది చూచుచునేయున్నది
రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారముతో అలుగులుగల రెండువందల డాళ్లను చేయించెను; ఒక్కొక డాలునకు ఆరువందల తులముల బంగారము పట్టెను.
మరియు సాగగొట్టిన బంగారముతో మూడువందల కేడెములను చేయించెను; ఒక్కొక కేడెమునకు మూడువందల తులముల బంగారము పట్టెను; వాటిని రాజు లెబానోను అరణ్యపు నగరునందుంచెను.
రాజైన సొలొమోను సుత్తెతో కొట్టిన బంగారముతో అలుగులు గల రెండువందల డాళ్లను చేయించెను; డాలు ఒకటింటికి ఆరువందల తులముల యెత్తు బంగారముండెను.
మరియు సుత్తెతో కొట్టిన బంగారముతో అతడు మూడువందల కేడెములను చేయించెను; కేడెము ఒకటింటికి మూడువందల బంగారపు తులములయెత్తు బంగారముండెను; వీటిని రాజు లెబానోను అరణ్యపు మందిరమందుంచెను.
మరియు హదరెజెరు సేవకులు పట్టుకొనియున్న బంగారు డాళ్లను దావీదు తీసికొని యెరూషలేమునకు చేర్చెను.
అతడు దేవుని మందిరములో ఓబేదెదోము నొద్దనున్న వెండియంతయు బంగారమంతయు ఉపకరణములన్నియు రాజు నగరునందున్న సొమ్మును కుదవపెట్టబడినవారిని తీసికొని షోమ్రోనునకు తిరిగివెళ్లెను.
ఆహాజు భాగము లేర్పరచి, యెహోవా మందిరములోనుండి యొక భాగమును, రాజనగరులోనుండి యొక భాగమును, అధిపతుల యొద్దనుండి యొక భాగమును తీసి అష్షూరు రాజునకిచ్చెను గాని అతడు అతనికి సహాయము చేయలేదు.
వాడు జ్ఞానము గలవాడై యుండునో బుద్ధిహీనుడై యుండునో అది ఎవనికి తెలియును? అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానముచేత సంపాదించుకొన్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారియై యుండును; ఇదియును వ్యర్థమే.