2దినవృత్తాంతములు 12: 8
క్రాస్-రిఫరెన్స్‌లు
" అయితే నన్ను సేవించుటకును, భూరాజులకు దాసులైయుండుటకును ఎంత భేదమున్నదో వారు తెలిసికొనునట్లు వారు అతనికి దాసులగుదురు."
సంబంధిత రిఫరెన్స్‌లు
చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము, దాని ఫలమును దాని సమృధ్ధిని అనుభవించునట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమియందు మేము దాసులమై యున్నాము.
యెహోవా, మా దేవా, నీవు గాక వేరు ప్రభువులు మమ్ము నేలిరి ఇప్పుడు నిన్నుబట్టియే నీ నామమును స్మరింతుము
నీకు సర్వసమృద్ధి కలిగియుండియు నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు
ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగినయుద్ధము లన్నిటిని చూడనివారందరిని శోధించి
యెహోవా, నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండునట్లు నీ కోపమునుబట్టి నన్ను శిక్షింపక నీ న్యాయవిధినిబట్టి నన్ను శిక్షింపుము.
వారు కానుకలు ఇచ్చి అన్యజనులలో విటకాండ్రను పిలుచుకొనినను ఇప్పుడే నేను వారిని సమకూర్చుదును; అధిపతులుగల రాజు పెట్టు భారముచేత వారు త్వరలో తగ్గిపోవుదురు.
గనుక ఆకలిదప్పులతోను వస్త్రహీనతతోను అన్ని లోపములతోను యెహోవా నీమీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు నిన్ను నశింపజేయువరకు నీ మెడమీద ఇనుపకాడి యుంచుదురు.
ఇశ్రాయేలీయుల తరతరములవారికి, అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడనివారికి యుద్ధముచేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి.
శ్రమపడువారిని వారికి కలిగిన శ్రమవలన ఆయన విడిపించును. బాధవలన వారిని విధేయులుగా చేయును.