లేఖనాలను అన్వేషించండి

2దినవృత్తాంతములు 18: 14

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతడు రాజునొద్దకు రాగా రాజు అతని చూచి మీకాయా, యుద్ధమునకు రామోత్గిలాదునకు మేము పోవుదుమా, మానుదుమా అని యడుగగా అతడు పోయి జయించుడి, వారు మీచేతికి అప్పగింపబడుదురనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1రాజులు 18:27

మధ్యాహ్నము కాగా ఏలీయా వాడు దేవుడైయున్నాడు. పెద్దకేకలు వేయుడి; వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమున నున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవుచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి యున్నదేమో అని అపహాస్యము చేయగా

1రాజులు 22:15

అతడు రాజునొద్దకు వచ్చినప్పుడు రాజు మీకాయా, నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్గిలాదుమీదికి పోదుమా పోకుందుమా అని యడుగగా అతడు యెహోవా దానిని రాజవైన నీచేతికి నప్పగించును గనుక నీవు దానిమీదికిపోయి జయమొందుదువని రాజుతో అనెను.

ప్రసంగి 11:1

నీ ఆహారమును నీళ్లమీద వేయుము,చాలా దినములైన తరువాత అది నీకు కనబడును.

విలాపవాక్యములు 4:21

అతని నీడక్రిందను అన్యజనులమధ్యను బ్రదికెదమని మేమనుకొన్నవాడు పట్టబడెను. ఊజు దేశములో నివసించు ఎదోముకుమారీ, సంతోషించుము ఉత్సహించుము ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును నీవు దానిలోనిది త్రాగి మత్తిల్లి నిన్ను దిగంబరినిగా చేసికొందువు

ఆమోసు 4:4

బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గాలునకు పోయి మరి యెక్కువగా తిరుగుబాటు చేయుడి, ప్రతి ప్రాతఃకాలమున బలులు తెచ్చి మూడేసి దినములకొకసారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి.

ఆమోసు 4:5

పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి, స్వేచ్చార్పణనుగూర్చి చాటించి ప్రకటన చేయుడి; ఇశ్రాయేలీయులారా, యీలాగున చేయుట మీకిష్టమైయున్నది; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

మత్తయి 26:45

అప్పుడాయన తన శిష్యులయొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి; ఇదిగో ఆ గడియ వచ్చియున్నది; మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడుచున్నాడు;

1రాజులు 22:6

ఇశ్రాయేలురాజు దాదాపు నాలుగు వందలమంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోత్గిలాదుమీదికి పోదునా పోకుందునా అని వారినడిగెను. అందుకు యెహోవా దానిని రాజైన నీచేతికి అప్పగించును గనుక

2దినవృత్తాంతములు 18:5

ఇశ్రాయేలురాజు నాలుగువందల మంది ప్రవక్తలను సమకూర్చి నేను రామోత్గిలాదుమీదికి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారినడిగెను. అందుకువారు పొమ్ము, దేవుడు రాజుచేతికి దానినప్పగించునని చెప్పిరి.

2దినవృత్తాంతములు 25:8

ఆలాగు పోవలెనని నీకున్నయెడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును; నిలువబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమేగదా అని ప్రకటింపగా