లేఖనాలను అన్వేషించండి

2దినవృత్తాంతములు 18: 34

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆ దినమున యుద్ధము ప్రబలమాయెను; అయినను ఇశ్రాయేలు రాజు అస్తమయమువరకు సిరియనులకెదురుగా తన రథమునందు నిలిచెను, ప్రొద్దుగ్రుంకువేళ అతడు చనిపోయెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

2దినవృత్తాంతములు 18:16

అతడు కాపరిలేని గొఱ్ఱలవలెనే ఇశ్రాయేలు వారందరును పర్వతములమీద చెదరిపోవుట చూచితిని; వీరికి యజమానుడు లేడనియు, వీరిలో ప్రతివాడు తన తన యింటికి సమాధానముగా పోవలెననియు యెహోవా సెలవిచ్చియున్నాడనెను.

2దినవృత్తాంతములు 18:19

ఇశ్రాయేలు రాజైన అహాబు రామోత్గిలాదుమీదికి పోయి పడిపోవునట్లు ఎవడు అతని ప్రేరేపించునని యెహోవా అడుగగా, ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరమిచ్చిరి.

2దినవృత్తాంతములు 18:27

అప్పుడు మీకాయా యిట్లనెను నీవు సురక్షితముగా తిరిగివచ్చినయెడల యెహోవా నా ద్వారా పలుకనే లేదనిచెప్పి, సమస్త జనులారా ఆలకించుడనెను.

సంఖ్యాకాండము 32:23

మీరు అట్లు చేయనియెడల యెహోవా దృష్టికి పాపము చేసినవారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలిసికొనుడి.

సామెతలు 13:21

కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును.

సామెతలు 28:17

ప్రాణము తీసి దోషము కట్టుకొనినవాడు గోతికి పరుగెత్తుచున్నాడు ఎవరును అట్టివానిని ఆపకూడదు.

1రాజులు 20:42

అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చునదేమనగా నేను శపించిన మనుష్యుని నీవు నీచేతిలోనుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులును అప్పగింపబడుదురని రాజుతో అనగా

2దినవృత్తాంతములు 18:11

ప్రవక్తలందరును ఆ ప్రకారముగానే ప్రవచించుచు యెహోవా రామోత్గిలాదును రాజు చేతికి అప్పగించును, దానిమీదికి పోయి జయమొందుము అనిరి.

యెషయా 44:25

నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను సోదెకాండ్రను వెఱ్ఱివారినిగా చేయువాడను జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే.