లేఖనాలను అన్వేషించండి

2దినవృత్తాంతములు 18: 28

క్రాస్-రిఫరెన్స్‌లు

" అంతట ఇశ్రాయేలు రాజును యూదారాజైన యెహోషాపాతును రామోత్గిలాదుమీదికి పోయిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

1రాజులు 22:29

ఇశ్రాయేలు రాజును యూదారాజగు యెహోషాపాతును రామోత్గిలాదు మీదికి పోవుచుండగా

1రాజులు 22:30

ఇశ్రాయేలు రాజు నేను మారువేషము వేసికొని యుద్ధములో ప్రవేశించెదను, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించుమని యెహోషాపాతుతో చెప్పి మారువేషము వేసికొని యుద్ధమందు ప్రవేశించెను.

1రాజులు 22:31

సరియారాజు తన రథములమీద అధికారులైన ముప్పది ఇద్దరు అధిపతులను పిలిపించి అల్పులతోనైనను ఘనులతోనైనను మీరు పోట్లాడవద్దు; ఇశ్రాయేలురాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చియుండగా

1రాజులు 22:32

రథాధిపతులు యెహోషాపాతును చూచి యితడే ఇశ్రాయేలు రాజనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదికి వచ్చిరి. యెహోషాపాతు కేకలువేయగా

1రాజులు 22:33

రథాధిపతులు అతడు ఇశ్రాయేలురాజు కానట్టు గురుతుపట్టి అతని తరుముట మానివేసిరి.

2దినవృత్తాంతములు 19:2

దీర్ఘదర్శి హనానీ కుమారుడునగు యెహూ అతనిని ఎదుర్కొనబోయి, రాజైన యెహోషాపాతుకు ఈలాగు ప్రకటన చేసెను నీవు భక్తిహీనులకు సహాయముచేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి గదా? అందువలన యెహోవా సన్నిధినుండి కోపము నీమీదికి వచ్చును.