లేఖనాలను అన్వేషించండి

2దినవృత్తాంతములు 25: 22

క్రాస్-రిఫరెన్స్‌లు

" యూదావారు ఇశ్రాయేలువారియెదుట నిలువలేక ఓడిపోగా ప్రతివాడును తన తన గుడారమునకు పారిపోయెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

2దినవృత్తాంతములు 28:5

అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతి కప్పగించెను. సిరియనులు అతని ఓడించి అతని జనులలో చాలమందిని చెరపట్టుకొని దమస్కునకు తీసికొనిపోయిరి. అతడును ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను; ఆ రాజు అతని లెస్సగా ఓడించెను.

2దినవృత్తాంతములు 28:6

రెమల్యా కుమారుడైన పెకహు యూదావారిలో పరాక్రమశాలులైన లక్ష ఇరువది వేలమందిని ఒక్కనాడు హతముచేసెను. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికిట్టిగతి పట్టెను.

1సమూయేలు 4:10

ఫిలిష్తీయులు యుద్దము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరు తమ డేరాలకు పరుగెత్తివచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను; ఇశ్రాయేలీయులలో ముప్పదివేల కాల్బలము కూలెను.

1రాజులు 22:36

సూర్యాస్తమయ సమయమందు దండువారందరు తమ తమ పట్టణములకును దేశములకును వెళ్లిపోవచ్చునని ప్రచురమాయెను.