లేఖనాలను అన్వేషించండి

2దినవృత్తాంతములు 25: 24

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతడు దేవుని మందిరములో ఓబేదెదోము నొద్దనున్న వెండియంతయు బంగారమంతయు ఉపకరణములన్నియు రాజు నగరునందున్న సొమ్మును కుదవపెట్టబడినవారిని తీసికొని షోమ్రోనునకు తిరిగివెళ్లెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

2దినవృత్తాంతములు 12:9

ఐగుప్తురాజైన షీషకు యెరూషలేముమీదికి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటిని రాజనగరులోని బొక్కసములన్నిటిని దోచుకొని, సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసికొనిపోయెను.

2రాజులు 14:14

మరియు యెహోవా మందిరమునందును రాజనగరునందును కనబడిన బంగారము వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణస్థులలో కుదవ పెట్టబడినవారిని తీసికొని షోమ్రోనునకు వచ్చెను.

2రాజులు 14:13

మరియు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అహజ్యాకు పుట్టిన యోవాషు కుమారుడైన అమజ్యా అను యూదా రాజును బేత్షెమెషు దగ్గర పట్టుకొని యెరూషలేమునకు వచ్చి, ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూలగుమ్మము వరకు యెరూషలేము ప్రాకారమును నాలుగువందల మూరల పొడుగున పడగొట్టెను.

1దినవృత్తాంతములు 26:15

ఓబేదెదోమునకు దక్షిణపువైపు కావలియు అతని కుమారులకు అసుప్పీమను ఇంటికావలియు పడెను.