లేఖనాలను అన్వేషించండి

2దినవృత్తాంతములు 25: 26

క్రాస్-రిఫరెన్స్‌లు

" అమజ్యా చేసిన యితర కార్యములు యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడియున్నవి."

సంబంధిత రిఫరెన్స్‌లు

2దినవృత్తాంతములు 20:34

యెహోషాపాతు చేసిన కార్యములన్నిటినిగూర్చి హనానీ కుమారుడైన యెహూ రచించిన గ్రంథమందు వ్రాయబడియున్నది. ఈ యెహూ పేరు, ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు కనబడుచున్నది.

2రాజులు 14:15

యెహోయాషు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు యూదారాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్ధమునుగూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

2దినవృత్తాంతములు 16:11

ఆసా చేసిన కార్యములన్నిటినిగూర్చి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.

2దినవృత్తాంతములు 35:27

అతడు చేసిన సమస్త క్రియలనుగూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.