2దినవృత్తాంతములు 25: 5
క్రాస్-రిఫరెన్స్‌లు
" అమజ్యా యూదావారినందరిని సమకూర్చి యూదా దేశమంతటను బెన్యామీనీయుల దేశమంతటను వారి వారి పితరుల యిండ్లనుబట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించెను. అతడు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పై ప్రాయముగల వారిని లెక్కింపగా, ఈటెను డాళ్లను పట్టుకొని యుద్ధమునకు పోదగినట్టి యోధులు మూడులక్షలమంది కనబడిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఇశ్రాయేలీయులందరిలో సామర్థ్యముగల మనుష్యులను ఏర్పరచుకొని, వెయ్యిమందికి ఒకనిగాను, నూరుమందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పదిమందికి ఒకనిగాను, న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజలమీద ప్రధానులనుగా నియమించెను.
మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును; తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును.
దావీదు సహస్రాధిపతులతోను శతాధిపతులతోను అధిపతులందరితోను ఆలోచనచేసి, సమాజముగా కూడిన ఇశ్రాయేలీయులందరితో ఈలాగు సెలవిచ్చెను
జనసంఖ్యనుబట్టి ఇశ్రాయేలీయుల పితరుల యింటిపెద్దలు సహస్రాధిపతులు శతాధిపతులు అనువారి లెక్కను గూర్చినది, అనగా ఏర్పాటైన వంతుల విషయములో ఏటేట నెలవంతున రాజునకు సేవచేసినవారిని గూర్చినది. వీరి సంఖ్య యిరువది నాలుగు వేలు.
ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్లువారిని, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయముగల వారిని, తమ తమ సేనలనుబట్టి నీవును అహరోనును లెక్కింపవలెను.
రెహబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇశ్రాయేలువారితో యుద్ధము చేయుటకును, రాజ్యమును తనకు మరల రప్పించుకొనుటకును అతడు యూదావారిలోనుండియు బెన్యామీనీయులలోనుండియు ఏర్పరచబడిన యుద్ధ శాలులను లక్ష యెనుబది వేలమందిని సమకూర్చగా
ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొను మూడు లక్షలమంది యూదావారును, కేడెములు ధరించి విల్లువేయు రెండు లక్షల ఎనుబది వేలమంది బెన్యామీనీయులును కూడిన సైన్యము ఆసాకు ఉండెను; వీరందరును పరాక్రమశాలులై యుండిరి.
వీరి పితరుల వంశములచొప్పున వీరి సంఖ్య యెంతనగా, యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నాయొద్ద మూడు లక్షలమంది పరాక్రమశాలులుండిరి.
రెండవవాడగు యెహోహానాను అను అధిపతియొద్ద రెండు లక్షల ఎనుబదివేలమంది యుండిరి.
మూడవవాడు జిఖ్రీ కుమారుడై యెహోవాకు తన్నుతాను మనఃపూర్వకముగా సమర్పించుకొనిన అమస్యా; అతనియొద్ద రెండు లక్షలమంది పరాక్రమశాలులుండిరి.
బెన్యామీనీయులలో ఎల్యాదా అను పరాక్రమశాలి యొకడుండెను; వీనియొద్ద వింటిని కేడెమును పట్టుకొనువారు రెండు లక్షలమంది యుండిరి.
రెండవవాడు యెహోజాబాదు; వీనియొద్ద లక్షయెనుబదివేలమంది యుద్ధసన్నద్ధులుండిరి.
మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదునొద్ద చేరిరి; వీరు డాలును ఈటెను వాడుకచేయగల యుద్ధప్రవీణులు, సింహముఖమువంటి ముఖములు గలవారు, కొండలలోనుండు జింకలంత పాదవేగము గలవారు.
నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవుడలకు గాలములు తగిలించి, నిన్నును నీ సైన్యమంతటిని గుఱ్ఱములను నానావిధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరిని, కవచములును డాళ్లును ధరించి ఖడ్గములు చేతపట్టుకొను వారినందరిని, మహాసైన్యముగా బయలుదేరదీసెదను.