2సమూయేలు 19: 27
క్రాస్-రిఫరెన్స్‌లు
" సీబా నీ దాసుడనైన నన్నుగూర్చి నా యేలినవాడవును రాజవునగు నీతో అబద్ధమాడెను. అయితే నా యేలినవాడవును రాజవునగు నీవు దేవదూత వంటివాడవు, నీ దృష్టికి ఏది యనుకూలమో దాని చేయుము."
సంబంధిత రిఫరెన్స్‌లు
రాజు నీ యజమానుని కుమారుడు ఎక్కడనున్నాడని అడిగెను. అందుకు సీబా చిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలీయులు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి యిప్పింతురనుకొని అతడు యెరూషలేములో నిలిచియున్నాడనెను.
నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.
అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు తన పొరుగువానిమీద నింద మోపడు
తమ పొరుగువారిని చాటున దూషించువారిని నేను సంహరించెదను అహంకార దృష్టిగలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను
మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను; ఏ సహోదరునినైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును; ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు.
మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు గనుక నా యేలినవాడవును రాజవునగు నీవు దేవుని దూతవంటివాడవై మంచి చెడ్డలన్నియు విచారింప చాలియున్నావు; కాబట్టి నీ దాసినగు నేను నా యేలినవాడగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకొంటిననెను.
సంగతిని రాజుతో మరుగుమాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా యేలినవాడవగు నీవు దేవదూతల జ్ఞానమువంటి జ్ఞానము గలవాడవు.
అందుకు ఆకీషు దైవదూతవలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేనెరుగుదును గాని ఫిలిష్తీయుల సర్దారులు ఇతడు మనతోకూడ యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు.
లేనివార్తను పుట్టింపకూడదు; అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు;
సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదునొద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవేగదా అని అడుగగా అతడు నీ దాసుడనైన నేనే సీబాను అనెను.
అతనియొద్ద వెయ్యిమంది బెన్యామీనీయులు ఉండిరి. మరియు సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయును అతని పదునయిదుగురు కుమారులును అతని యిరువదిమంది దాసులును వచ్చి
దాసునిగూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడవగుదువు.
అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానినిబట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదుగాని దేవుని దూతను వలెను, క్రీస్తుయేసును వలెను నన్ను అంగీకరించితిరి
సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.