లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 19: 5

క్రాస్-రిఫరెన్స్‌లు

" రాజు అబ్షాలోమునుగూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి యోవాబు విని నగరియందున్న రాజునొద్దకు వచ్చి నీ ప్రాణమును నీ కుమారుల ప్రాణములను నీ కుమార్తెల ప్రాణములను నీ భార్యల ప్రాణములను నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులనందరిని నేడు సిగ్గుపరచి"

సంబంధిత రిఫరెన్స్‌లు

నెహెమ్యా 9:27

అందుచేత నీవు వారిని వారి శత్రువులచేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి, వారి శత్రువులచేతిలోనుండి వారిని తప్పించుటకై నీ కృపాసంపత్తినిబట్టి వారికి రక్షకులను దయచేసితివి.

కీర్తనలు 3:8

రక్షణ యెహోవాది నీ ప్రజలమీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. (సెలా.)

కీర్తనలు 18:47

ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే.

కీర్తనలు 18:48

ఆయన నా శత్రువులచేతిలోనుండి నన్ను విడిపించును. నా మీదికి లేచువారికంటె ఎత్తుగా నీవు నన్నుహెచ్చించుదువు బలాత్కారముచేయు మనుష్యుల చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు

న్యాయాధిపతులు 19:1

ఇశ్రాయేలీయులకు రాజులేని దినములలో లేవీయు డైన యొకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బేత్లె హేములోనుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చు కొనగా

2సమూయేలు 3:24

యోవాబు రాజునొద్దకు వచ్చి చిత్తగించుము, నీవు ఏమి చేసితివి? అబ్నేరు నీయొద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసితివి?

2సమూయేలు 19:13

మరియు అమాశాయొద్దకు దూతలను పంపినీవు నాకు ఎముక నంటిన బంధువుడవు మాంసము నంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను ఖాయ పరచనియెడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగ జేయును గాకని చెప్పుడనెను.

1రాజులు 2:5

అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని, ఇశ్రాయేలు సేనాధిపతులగు నేరు కుమారుడైన అబ్నేరు యెతెరు కుమారుడైన అమాశాయను వారిద్దరికి అతడు చేసినదానిని నీవెరుగుదువు; అతడు వారిని చంపి యుద్ధసమయమందైనట్లుగా సమాధానకాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టుమీదను తన పాదరక్షల మీదను పడజేసెను.

కీర్తనలు 34:5

వారు ఆయనతట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును.