లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 19: 6

క్రాస్-రిఫరెన్స్‌లు

" నీ స్నేహితులయెడల ప్రేమ చూపక నీ శత్రువులయెడల ప్రేమ చూపుచు, ఈ దినమున అధిపతులును సేవకులును నీకు ఇష్టజనులు కారని నీవు కనుపరచితివి. మేమందరము చనిపోయి అబ్షాలోము బ్రదికియుండినయెడల అది నీకు ఇష్టమగునన్న మాట యీ దినమున నేను తెలిసికొనుచున్నాను. ఇప్పుడు లేచి బయటికివచ్చి నీ సేవకులను ధైర్యపరచుము."

సంబంధిత రిఫరెన్స్‌లు

2సమూయేలు 3:24

యోవాబు రాజునొద్దకు వచ్చి చిత్తగించుము, నీవు ఏమి చేసితివి? అబ్నేరు నీయొద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసితివి?

2సమూయేలు 3:25

నేరు కుమారుడగు అబ్నేరును నీవెరుగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటిని నీవు చేయు సమస్తమును తెలిసికొనుటకై అతడు వచ్చెనని చెప్పి

యోబు 34:18

నీవు పనికిమాలిన వాడవని రాజుతోనైనను మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చునా?

సామెతలు 19:9

కూటసాక్షి శిక్షనొందకపోడు అబద్ధములాడువాడు నశించును.

సామెతలు 19:10

భోగముల ననుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజులనేలుట దాసునికి బొత్తిగా తగదు.

అపోస్తలులకార్యములు 23:5

వారిలో ఒక భాగము సద్దూకయ్యులును మరియొక భాగము పరిసయ్యులునై యున్నట్టు పౌలు గ్రహించి సహోదరులారా, నేను పరిసయ్యుడను పరిసయ్యుల సంతతివాడను; మనకున్న నిరీక్షణను గూర్చియు, మృతుల పునరుత్థానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను.

2సమూయేలు 3:12

అబ్నేరు తన తరపున దావీదునొద్దకు దూతలను పంపి ఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధన చేసినయెడల నేను నీకు సహాయము చేసి, ఇశ్రాయేలు వారినందరిని నీ తట్టు త్రిప్పెదనని వర్తమానము పంపగా దావీదు మంచిది; నేను నీతో నిబంధన చేసెదను.

2సమూయేలు 3:39

పట్టాభిషేకము నొందినవాడనైనను, నేడు నేను బలహీనుడనైతిని. సెరూయా కుమారులైన యీ మనుష్యులు నా కంటె బలము గలవారు, అతడు జరిగించిన దుష్క్రియనుబట్టి యెహోవా కీడుచేసినవానికి ప్రతికీడు చేయునుగాక.