ద్వితియోపదేశాకాండము 22: 6
క్రాస్-రిఫరెన్స్‌లు
" గుడ్లయినను పిల్లలైననుగల పక్షిగూడు చెట్టుమీదనే గాని నేలమీదనేగాని త్రోవలోనేగాని నీకు కనబడినయెడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగియున్నయెడల పిల్లలతో కూడ తల్లిని తీసికొనక నీకు మేలు కలుగునట్లును"
సంబంధిత రిఫరెన్స్‌లు
అయిదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా; అయినను వాటిలో ఒకటైనను దేవునియెదుట మరువబడదు.
పక్షులు పశువులు భూమిమీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడ నున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమిమీద బహుగా విస్తరించి భూమిమీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పెను.
నా సహోదరుడైన ఏశావుచేతినుండి దయచేసి నన్ను తప్పించుము; అతడు వచ్చి పిల్లలతో తల్లిని, నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను.
అయితే అది ఆవైనను గొఱ్ఱ మేకలలోనిదైనను మీరు దానిని దానిపిల్లను ఒక్కనాడే వధింపకూడదు.
నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే.
నీ జనుల మీదికి అల్లరి వచ్చును; షల్మాను యుద్ధముచేసి బేతర్బేలును పాడుచేసినట్లు ప్రాకారములుగల నీ పట్టణములన్నియు పాడగును; పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడుదురు.