నిర్గమకాండము 39: 21
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆ పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లును అది ఏఫోదునుండి విడిపోకుండునట్లును ఆ పతకమును దాని ఉంగరములకును ఏఫోదు ఉంగరములకును నీలిసూత్రముతో కట్టిరి. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరినయెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను.
దేవుని వెఱ్ఱితనము మనుష్య జ్ఞానముకంటె జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్యుల బలముకంటె బలమైనది.
ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు,
పతకము ఏఫోదు నిలువుటంగీ విచిత్రమైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై యుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను.
మరియు ఏఫోదు మీదనుండు విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోను నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోను పేనిన సన్ననారతోను కుట్టవలెను.
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు కూడిరాగా