నిర్గమకాండము 39: 33
క్రాస్-రిఫరెన్స్‌లు
" అప్పుడు వారు మందిరమును గుడారమును దాని ఉపకరణములన్నిటిని దాని కొలుకులను, పలకలను, కమ్ములను, స్తంభములను, దిమ్మలను,"
సంబంధిత రిఫరెన్స్‌లు
యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
దాని వాసన చూచుటకు దానివంటిది చేయువాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.
ప్రత్యక్షపు గుడారమును సాక్ష్యపు మందసమును దానిమీదనున్న కరుణాపీఠమును ఆ గుడారపు ఉపకరణములన్నిటిని
బల్లను దాని ఉపకరణములను నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటిని ధూపవేదికను
దహనబలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను
యాజకసేవ చేయునట్లు సేవా వస్త్రములను యాజకుడైన అహరోనుయొక్క ప్రతిష్ఠిత వస్త్రములను అతని కుమారుల వస్త్రములను
అభిషేకతైలమును పరిశుద్ధ స్థలముకొరకు పరిమళ ధూపద్రవ్యములను నేను నీకాజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను.
అవేవనగా మందిరము దాని గుడారము దాని పైకప్పు దాని కొలుకులు దాని పలకలు దాని అడ్డకఱ్ఱలు దాని స్తంభములు దాని దిమ్మలు.
మందసము దాని మోతకఱ్ఱలు, కరుణాపీఠము కప్పు తెర,
బల్ల దాని మోతకఱ్ఱలు దాని ఉపకరణములన్నియు, సన్నిధి రొట్టెలు,
వెలుగు కొఱకు దీపవృక్షము దాని ఉపకరణములు దాని ప్రదీపములు, దీపములకు తైలము
ధూపవేదిక దాని మోతకఱ్ఱలు, అభిషేకతైలము పరిమళ ద్రవ్య సంభారము, మందిర ద్వారమున ద్వారమునకు తెర.
దహనబలిపీఠము దానికి కలిగిన ఇత్తడి జల్లెడ దాని మోతకఱ్ఱలు దాని యుపకరణములన్నియు, గంగాళము దాని పీట
ఆవరణపు తెరలు దాని స్తంభములు వాటి దిమ్మలు ఆవరణ ద్వారమునకు తెర
మందిరమునకు మేకులు ఆవరణమునకు మేకులు వాటికి త్రాళ్లు
పరిశుద్ధస్థలములో సేవ చేయుటకు సేవా వస్త్రములు, అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు యాజకులగునట్లు అతని కుమారులకును వస్త్రములు నవియే అనెను.
పరిశుద్ధస్థలముయొక్క సేవనిమిత్తము ప్రతివిధమైన పనిచేయ తెలిసికొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసెనో అట్టి బెసలేలును అహోలీయాబును మొదలైన ప్రజ్ఞావంతులందరును యెహోవా ఆజ్ఞాపించిన అంతటిచొప్పున చేయుదురనెను.
ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటివేళ యెహోవా మేఘము మందిరముమీద ఉండెను. రాత్రివేళ అగ్ని దానిమీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరిగెను.
మరియు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీలచేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను; అది ఒకటే మందిరమగును.
మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పనియైన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను.
ప్రత్యక్షపు గుడారపు మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీయులు చేసిరి.
వారు మందసము బల్ల దీపవృక్షము వేదికలు తాము సేవ చేయు పరిశుద్ధస్థలములోని ఉపకరణములు అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరుపవలసినవారు.
మెరారి కుమారులు మందిరము యొక్క పలకలను దాని అడ్డకఱ్ఱలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని ఉపకరణములన్నిటిని దాని సేవకొరకైనవన్నిటిని