లేఖనాలను అన్వేషించండి

ఎజ్రా 8: 2

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఫీనెహాసు వంశములో గెర్షోమును, ఈతామారు వంశములో దానియేలును, దావీదు వంశములో హట్టూషును,"

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 6:3

అమ్రాము కుమారులు అహరోను మోషే, కుమార్తె మిర్యాము. అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.

1దినవృత్తాంతములు 6:4

ఎలియాజరు ఫీనెహాసును కనెను, ఫీనెహాసు అబీషూవను కనెను,

1దినవృత్తాంతములు 6:5

అబీషూవ బుక్కీని కనెను, బుక్కీ ఉజ్జీని కనెను,

1దినవృత్తాంతములు 6:6

ఉజ్జీ జెరహ్యాను కనెను, జెరహ్యా మెరాయోతును కనెను,

1దినవృత్తాంతములు 6:7

మెరాయోతు అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను,

1దినవృత్తాంతములు 6:8

అహీటూబు సాదోకును కనెను, సాదోకు అహిమయస్సును కనెను,

1దినవృత్తాంతములు 6:9

అహిమయస్సు అజర్యాను కనెను, అజర్యా యోహానానును కనెను,

1దినవృత్తాంతములు 6:10

యోహానాను అజర్యాను కనెను, ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించినవాడు.

1దినవృత్తాంతములు 6:11

అజర్యా అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను,

1దినవృత్తాంతములు 6:12

అహీటూబు సాదోకును కనెను, సాదోకు షల్లూమును కనెను,

1దినవృత్తాంతములు 6:13

షల్లూము హిల్కీయాను కనెను, హిల్కీయా అజర్యాను కనెను,

1దినవృత్తాంతములు 6:14

అజర్యా శెరాయాను కనెను, శెరాయా యెహోజాదాకును కనెను.

1దినవృత్తాంతములు 6:15

యెహోవా నెబుకద్నెజరుద్వారా యూదావారిని యెరూషలేమువారిని చెరతీసికొని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికిపోయెను.

1దినవృత్తాంతములు 24:1

అహరోను సంతతివారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.

1దినవృత్తాంతములు 24:2

నాదాబును అబీహుయును సంతతిలేకుండ తమ తండ్రికంటె ముందుగా చనిపోయిరి గనుక ఎలియాజరును ఈతామారును యాజకత్వము జరుపుచువచ్చిరి.

1దినవృత్తాంతములు 24:3

దావీదు ఎలియాజరు సంతతివారిలో సాదోకును ఈతామారు సంతతివారిలో అహీమెలెకును ఏర్పరచి, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టి పని నియమించెను.

1దినవృత్తాంతములు 24:4

వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతివారిలోని పెద్దలకంటె ఎలియాజరు సంతతివారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి గనుక ఎలియాజరు సంతతివారిలో పదునారుగురు తమ పితరుల యింటివారికి పెద్దలుగాను, ఈతామారు సంతతివారిలో ఎనిమిదిమంది తమ తమ పితరుల యింటివారికి పెద్దలుగాను నియమింపబడిరి.

1దినవృత్తాంతములు 24:5

ఎలియాజరు సంతతిలోని వారును, ఈతామారు సంతతివారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులగు అధికారులై యుండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లువేసి వంతులు పంచుకొనిరి.

1దినవృత్తాంతములు 24:6

లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షెమయా రాజు ఎదుటను, అధిపతుల యెదుటను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు ఎదుటను, యాజకుల యెదుటను, లేవీయుల యెదుటను, పితరుల యిండ్లపెద్దలైన వారి యెదుటను వారి పేళ్లు దాఖలు చేసెను; ఒక్కొక్క పాత్రలోనుండి యొక పితరుని యింటి చీటి ఎలియాజరు పేరటను ఇంకొకటి ఈతామారు పేరటను తీయబడెను.

1దినవృత్తాంతములు 3:1

దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులెవరనగా యెజ్రెయేలీయురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు; కర్మెలీయురాలైన అబీగయీలునకు పుట్టిన దానియేలు రెండవవాడు,

1దినవృత్తాంతములు 3:22

షెకన్యా కుమారులలో షెమయా అను ఒకడుండెను; షెమయా కుమారులు ఆరుగురు. హట్టూషు ఇగాలు బారియహు నెయర్యా షాపాతు.

ఎజ్రా 8:15

వీరిని నేను అహవా వైపునకు పారు నదియొద్దకు సమకూర్చితిని. అచ్చట మేము మూడు దినములు గుడారములలో ఉంటిమి. అంతలో నేను జనులను యాజకులను తనికీ చూడగా లేవీయుడొకడును నాకు కనబడలేదు.