యెహోషువ 21: 1
క్రాస్-రిఫరెన్స్‌లు
" లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్ద కును, నూను కుమారుడైన యెహోషువయొద్దకును, ఇశ్రాయేలీయుల గోత్రములయొక్క పితరుల కుటుంబముల ప్రధానులయొద్దకును వచ్చి"
సంబంధిత రిఫరెన్స్‌లు
యాజకుడైన ఎలియాజ రును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రములయొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులును షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారము నొద్ద యెహోవా సన్నిధిని చీట్లవలన పంపకముచేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి.
వారి పితరుల కుటుంబముల మూలపురుషులు ఎవరనగా, ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు పల్లు హెస్రోను కర్మీ; వీరు రూబేను కుటుంబములు.
అహరోను కుమారుడైన ఎలియాజరు పూతీయేలు కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసికొనెను. ఆమె అతనికి ఫీనెహాసును కనెను; వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరుల మూలపురుషులు
ఇశ్రాయేలీయులు కనానుదేశమున పొందిన స్వాస్థ్య ములు ఇవి.
వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటి కిని నూను కుమారుడైన యెహోషువ యెదుటికిని ప్రధా నుల యెదుటికిని వచ్చిమా సహోదరులమధ్య మాకు స్వాస్థ్యమియ్యవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించె నని మనవి చేయగా యెహోషువ యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరులమధ్య వారికి స్వాస్థ్యములిచ్చెను.
ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసినవారెవరనగా, యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు.
మరియు ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రములో ఒక్కొక ప్రధానుని ఏర్పరచుకొనవలెను.
వారెవరనగా, యూదావారి గోత్రములో యెఫున్నె కుమారుడైన కాలేబు.
షిమ్యోనీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన షెమూయేలు,
బెన్యామీనీయుల గోత్రములో కిస్లోను కుమారుడైన ఎలీదాదు.
దానీయుల గోత్రములో యొగ్లి కుమారుడైన బుక్కీ ప్రధాని,
యోసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయేలు మనష్షీయుల గోత్రప్రధాని,
ఎఫ్రాయిమీయుల గోత్రములో షిప్తాను కుమారుడైన కెమూయేలు ప్రధాని,
జెబూలూనీయుల గోత్రములో పర్నాకు కుమారుడైన ఎలీషాపాను ప్రధాని,
ఇశ్శాఖారీయుల గోత్రములో అజాను కుమారుడైన పల్తీయేలు ప్రధాని,
ఆషేరీయుల గోత్రములో షెలోమి కుమారుడైన అహీహూదు ప్రధాని.
నఫ్తాలీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన పెదహేలు ప్రధాని.
కనాను దేశములో ఇశ్రాయేలీయులకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టుటకు యెహోవా ఆజ్ఞాపించినవారు వీరే.
యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు, యాజకులకు ఫరో బత్తెములు నియమించెను. ఫరో ఇచ్చిన బత్తెములవలన వారికి భోజనము జరిగెను గనుక వారు తమ భూములను అమ్మలేదు.
వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించెదను ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను.
అయితే లేవీయుల పట్టణములు, అనగా వారి స్వాధీన పట్టణములలోని యిండ్లను విడిపించుటకు అధికారము లేవీయులకు శాశ్వతముగా ఉండును.
లేవి కుమారుల పేళ్లు గెర్షోను కహాతు మెరారి అనునవి.
మరియు లేవీయుల సంబంధమైనవారిలో యూదా వంశస్థులలోనివారు బెన్యామీనీయులమధ్య భాగములు పొందిరి.
ఈ ప్రతిష్ఠితభూమి యాజకులదగును. అది ఉత్తరదిక్కున ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు పడమటి దిక్కున పదివేల కొలకఱ్ఱల వెడల్పును తూర్పుదిక్కున పదివేల కొలకఱ్ఱల వెడల్పును దక్షిణ దిక్కున ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు ఉండవలెను. యెహోవా పరిశుద్ధస్థలము దాని మధ్య ఉండును.