లేఖనాలను అన్వేషించండి

యెహోషువ 21: 25

క్రాస్-రిఫరెన్స్‌లు

" రెండు పట్టణ ములును, అనగా మనష్షే అర్ధగోత్రికులనుండి తానా కును దాని పొలమును గత్రిమ్మోనును దాని పొల మును ఇచ్చిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 6:70

మరియు మనష్షే అర్ధగోత్రస్థానములోనుండి ఆనేరును దాని గ్రామములను బిలియామును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి.

యెహోషువ 17:11

ఇశ్శాఖారీయుల ప్రదేశములోను ఆషేరీయుల ప్రదేశ ములోను బేత్షెయాను దాని పురములును ఇబ్లెయామును దాని పురములును దోరు నివాసులును దాని పురములును ఏన్దోరు నివాసులును దాని పురములును తానాకు నివాసులును దాని పురములును మెగిద్దో నివాసులును దాని పురములును, అనగా మూడు కొండల ప్రదేశము మనష్షీయులకు కలిగియున్నది.

న్యాయాధిపతులు 5:19

రాజులు వచ్చి యుద్ధముచేసిరి. మెగిద్దో కాలువలయొద్దనున్న తానాకులో కనాను రాజులు యుద్ధముచేసిరి.

న్యాయాధిపతులు 1:27

మనష్షీయులు బేత్షెయానును దాని పల్లెలను, తయి నాకును దాని పల్లెలను, దోరునివాసులను దోరు పల్లెలను, ఇబ్లెయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను, మెగిద్దో పల్లెలను, స్వాధీనపరచుకొన లేదు; ఏలయనగా కనానీయులు ఆ దేశములో నివసింపవలెనని గట్టిపట్టు పట్టియుండిరి.

1దినవృత్తాంతములు 6:69

అయ్యాలోనును దాని గ్రామములును గత్రిమ్మోనును దాని గ్రామములును వారికియ్యబడెను.