లేఖనాలను అన్వేషించండి

యెహోషువ 21: 27

క్రాస్-రిఫరెన్స్‌లు

" లేవీయుల వంశములలో గెర్షోనీయులకు రెండు పట్టణ ములను, అనగా నరహంతకునికొరకు ఆశ్రయపట్టణమగు బాషానులోని గోలానును దాని పొలమును బెయెష్టెరాను దాని పొలమును ఇచ్చిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహోషువ 21:6

ఇశ్శాఖారు గోత్రికులనుండియు, ఆషేరు గోత్రికులనుండియు, నఫ్తాలి గోత్రికులనుండియు, బాషానులోనున్న మనష్షే అర్ధగోత్రపువారినుండియు చీట్లవలన గెర్షోనీయులకు కలిగినవి పదమూడు పట్టణములు.

యెహోషువ 20:8

తూర్పుదిక్కున యొర్దాను అవతల యెరికోనొద్ద రూబేనీ యుల గోత్రములోనుండి మైదానము మీదనున్న అరణ్య ములోని బేసెరును, గాదీయుల గోత్రము లోనుండి గిలాదు లోని రామోతును, మనష్షీయుల గోత్రములోనుండి బాషానులోని గోలానును నియమించిరి.

ద్వితియోపదేశాకాండము 1:4

నలుబదియవ సంవత్సరములో పదకొండవ నెల మొదటి తేదిని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తనకాజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను.

ద్వితియోపదేశాకాండము 4:43

అవేవనగా రూబేనీయులకు మైదానపు దేశారణ్యమందలి బేసెరును, గాదీయులకు గిలాదులోనున్న రామోతును, మనష్షీయులకు బాషానులోనున్న గోలాను అనునవే.

1దినవృత్తాంతములు 6:71

మరియు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్రవంశ స్థానములోనుండి బాషానునందలి గోలానుదాని గ్రామములు, అష్తారోతు దాని గ్రామములు,

1దినవృత్తాంతములు 6:71

మరియు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్రవంశ స్థానములోనుండి బాషానునందలి గోలానుదాని గ్రామములు, అష్తారోతు దాని గ్రామములు,

సంఖ్యాకాండము 35:6

మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో ఆరు ఆశ్రయపురములుండవలెను. నరహంతుకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను. అవియు గాక నలువదిరెండు పురములను ఇయ్యవలెను.

1దినవృత్తాంతములు 6:62

గెర్షోను సంతతివారికి వారి వంశములచొప్పున ఇశ్శాఖారు గోత్రస్థానములోనుండియు, ఆషేరు గోత్రస్థానములోనుండియు, నఫ్తాలి గోత్రస్థానములోనుండియు బాషానునందుండు మనష్షే గోత్రస్థానములోనుండియు పదుమూడు పట్టణములు ఇయ్యబడెను.