లేఖనాలను అన్వేషించండి

న్యాయాధిపతులు 9: 18

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలె కును రాజుగా నియమించుకొనిన విషయములో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించినయెడల"

సంబంధిత రిఫరెన్స్‌లు

న్యాయాధిపతులు 9:5

తరువాత అతడు ఒఫ్రాలోనున్న తన తండ్రి యింటికి పోయి యెరుబ్బయలు కుమారు లును తన సహోదరులునైన ఆ డెబ్బదిమంది మనుష్యులను ఒక్క రాతిమీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగియుండి తప్పించుకొనెను.

న్యాయాధిపతులు 9:6

తరువాత షెకెము యజమానులందరును మిల్లో ఇంటివారందరును కూడివచ్చి షెకెములోనున్న మస్తకి వృక్షముక్రింద దండు పాళెమునొద్ద అబీమెలెకును రాజుగా నియమించిరి.

న్యాయాధిపతులు 8:35

మరియు వారు గిద్యోనను యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకార మంతయుమరచి అతని యింటివారికి ఉపకారము చేయక పోయిరి.

కీర్తనలు 109:4

నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నామీద పగ పట్టియున్నారు అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను.

న్యాయాధిపతులు 9:6

తరువాత షెకెము యజమానులందరును మిల్లో ఇంటివారందరును కూడివచ్చి షెకెములోనున్న మస్తకి వృక్షముక్రింద దండు పాళెమునొద్ద అబీమెలెకును రాజుగా నియమించిరి.

న్యాయాధిపతులు 9:14

అప్పుడు చెట్లన్నియు నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్లపొదయొద్ద మనవిచేయగా

న్యాయాధిపతులు 8:31

షెకెములోనున్న అతని ఉపపత్నియు అతని కొక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకను పేరు పెట్టెను.

1సమూయేలు 12:12

అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే, మీ దేవుడైన యెహోవా మీకు రాజైయున్నను ఆయన కాదు, ఒక రాజు మిమ్మును ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి.

కీర్తనలు 12:8

నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్టులై నలుదిక్కుల తిరుగులాడుదురు.