లేఖనాలను అన్వేషించండి

న్యాయాధిపతులు 9: 44

క్రాస్-రిఫరెన్స్‌లు

" అబీమెలెకును అతనితో నున్న తెగలును ఇంకసాగి పట్టణపు గవిని ప్రదేశమునొద్ద నిలువగా రెండు తెగలు పరుగెత్తి పొలముల లోనున్న వారందరి మీదపడి వారిని హతముచేసిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

న్యాయాధిపతులు 9:15

ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియ మించుకొన గోరినయెడల రండి నా నీడను ఆశ్రయించుడి; లేదా అగ్ని నాలోనుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పెను.

న్యాయాధిపతులు 9:20

లేనియెడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెమువారిని మిల్లో యింటి వారిని కాల్చివేయునుగాక, షెకె మువారిలోనుండియు మిల్లో యింటినుండియు అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించునుగాక అని చెప్పి

గలతీయులకు 5:15

అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించినయెడల మీరు ఒకనివలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి.

న్యాయాధిపతులు 9:35

ఎబెదు కుమారుడైన గాలు బయలుదేరి పట్ట ణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అబీమెలెకును అతనితో నున్న జనులును పొంచియుండుట చాలించి లేచిరి.