లేఖనాలను అన్వేషించండి

న్యాయాధిపతులు 9: 3

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతని తల్లి సహోదరులు అతనిగూర్చి షెకెము యజమా నులు వినునట్లు ఆ మాటలన్నియు చెప్పగా వారుఇతడు మన సహోదరుడనుకొని తమ హృదయము అబీమెలెకు తట్టు త్రిప్పుకొనిరి; "

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 10:3

దుష్టులు తమ మనోభిలాషనుబట్టి అతిశయపడుదురు లోభులు యెహోవాను తిరస్కరింతురు

సామెతలు 1:11

మాతోకూడ రమ్ము మనము ప్రాణము తీయుటకై పొంచియుందము నిర్దోషియైన యొకని పట్టుకొనుటకు దాగియుందము

సామెతలు 1:12

పాతాళము మనుష్యులను మింగివేయునట్లు వారిని జీవముతోనే మింగివేయుదము సమాధిలోనికి దిగువారు మింగబడునట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము.

సామెతలు 1:13

పలువిధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన యిండ్లను దోపుడుసొమ్ముతో నింపుకొందము

సామెతలు 1:14

నీవు మాతో పాలివాడవై యుండుము మనకందరికిని సంచి ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు.

ఆదికాండము 29:15

లాబాను నీవు నా బంధువుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసెదవా? నీకేమి జీతము కావలెనో చెప్పుమని యాకోబు నడిగెను.

2సమూయేలు 15:13

ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా