లేఖనాలను అన్వేషించండి

న్యాయాధిపతులు 9: 55

క్రాస్-రిఫరెన్స్‌లు

" అబీమెలెకు చనిపోయెనని ఇశ్రాయేలీయులు తెలిసికొనినప్పుడు ఎవరిచోటికి వారు పోయిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

2సమూయేలు 18:16

అప్పుడు జనులను ఇక హతము చేయక విడువవలసినదని యోవాబు బాకా ఊదింపగా ఇశ్రాయేలీయులను తరుముకొని పోయిన జనులు తిరిగివచ్చిరి.

2సమూయేలు 20:21

బిక్రి కుమారుడగు షెబ అను ఎఫ్రాయిము మన్యపువాడు ఒకడు రాజైన దావీదుమీద ద్రోహము చేసియున్నాడు; మీరు వానిని మాత్రము అప్పగించుడి; తోడనే నేను ఈ పట్టణము విడిచిపోవుదునని చెప్పగా ఆమె యోవాబుతో చిత్తము, వాని తల ప్రాకారము పైనుండి పడవేయబడునని చెప్పి పోయి

2సమూయేలు 20:22

తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికి తెలియ జేయగా, వారు బిక్రి కుమారుడగు షెబయొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తరువాత జనులందరును ఆ పట్టణమును విడిచి యెవరి గుడారములకు వారు పోయిరి; యోవాబు యెరూషలేమునకు రాజునొద్దకు తిరిగివచ్చెను.

1రాజులు 22:35

నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియనుల యెదుట అతని రథముమీద నిలువబెట్టిరి; అస్తమయమందు అతడు మరణమాయెను; తగిలిన గాయములోనుండి అతని రక్తము కారి రథములో మడుగుగట్టెను.

1రాజులు 22:36

సూర్యాస్తమయ సమయమందు దండువారందరు తమ తమ పట్టణములకును దేశములకును వెళ్లిపోవచ్చునని ప్రచురమాయెను.

సామెతలు 22:10

తిరస్కారబుద్ధి గలవాని తోలివేసినయెడల కలహములు మానును పోరు తీరి అవమానము మానిపోవును.